krithi shetty : వరుస ఆఫర్లతో బిజీగా మారిన ఉప్పెన బ్యూటీ.. ఆ స్టార్ డైరెక్టర్ కు నో చెప్పిందట..

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన సినిమా ఉప్పెన. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారానే  బెంగుళూరు బ్యూటీ కృతి శెట్టి కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

krithi shetty : వరుస ఆఫర్లతో బిజీగా మారిన ఉప్పెన బ్యూటీ.. ఆ స్టార్ డైరెక్టర్ కు నో చెప్పిందట..
కృతి శెట్టి.. మెగా హీరో వైష్ణవ్‏కు జోడీగా ఉప్పెన సినిమాతో వెండితెరకు హీరోయిన్‏గా పరిచయమైంది. ఈ సినిమాలో కృతి శెట్టి బేబమ్మ నటించి.. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
Follow us
Rajeev Rayala

|

Updated on: May 12, 2021 | 4:52 PM

krithi shetty: మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన సినిమా ఉప్పెన. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారానే  బెంగుళూరు బ్యూటీ కృతి శెట్టి కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే కుర్రాళ్లను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. చూడచక్కని రూపంతోపాటు అభినయంతోనూ ఆకట్టుకుంది కృతి. ఇక ఉప్పెన సినిమా సంచలన విజయం సాధించడంతో ఈ అమ్మడికి ఆఫర్లు వెల్లువెత్తాయి. తెలుగులో ఇప్పటికే పలు సినిమాలకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అలాగే సుధీర్ బాబు నటిస్తున్న ఓ సినిమాలో కూడా కృతి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. అలాగే ఎనర్జిటిక్ హీరో రామ్ లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ కృతి శెట్టి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఇవే కాదు మరి కొన్ని సినిమాలు కూడా ఈ అమ్మడి ఖాతాలో ఉన్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కృతి శెట్టి ఓ స్టార్ డైరెక్టర్ కు నో చెప్పిందని తెలుస్తుంది.

దగ్గుబాటి అభిరామ్ హీరోగా తేజ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కృతి శెట్టిని అడిగారట. కానీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో తేజ ఆఫర్ ను కృతిశెట్టి సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తుంది. కృతి నో చెప్పడంతో మరో హీరోయిన్ ను వెతికే పనిలోపడ్డారట చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi : తారక్ యోగక్షేమాలు ఫోన్ ద్వారా తెలుసుకున్న మెగాస్టార్.. ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడన్న చిరు ..

Shyam Singha Roy movie: ఈసారి డిటెక్టివ్ గా మారి నవ్వులు పూయించనున్న నాని..

Chiranjeevi : మెగాస్టార్ సినిమాకు మళ్లీ దర్శకుడు మారనున్నాడా.. లూసిఫర్ రీమేక్ కు స్క్రిప్ట్ కష్ఠాలు..