Anushka Shetty: ఎన్నో సినిమాలు ఫైన‌ల‌య్యాయి.. కానీ ఒక్క‌టి కూడా ప‌ట్టాలెక్క‌డం లేదు.. ఏంటి స్వీటీ సంగ‌తి..!

ప్రస్తుతానికి మన గ్లామర్ ఇండస్ట్రీలో డల్ గా కెరీర్ ని లాక్కొస్తున్న హీరోయిన్ల లిస్టు తీస్తే.. అందులో మొదటి పేరు బొమ్మాళి అనుష్కదే అయ్యుంటుంది. అంటే అన్నారంటారు గానీ..

Anushka Shetty: ఎన్నో సినిమాలు ఫైన‌ల‌య్యాయి.. కానీ ఒక్క‌టి కూడా ప‌ట్టాలెక్క‌డం లేదు.. ఏంటి స్వీటీ సంగ‌తి..!
Anushka Shetty

ప్రస్తుతానికి మన గ్లామర్ ఇండస్ట్రీలో డల్ గా కెరీర్ ని లాక్కొస్తున్న హీరోయిన్ల లిస్టు తీస్తే.. అందులో మొదటి పేరు బొమ్మాళి అనుష్కదే అయ్యుంటుంది. అంటే అన్నారంటారు గానీ.. ఆమె గ్రాఫ్ నిజంగానే అంత నీరసంగానే వుంది. ఇంతకీ… స్వీటీ మనసులో ఏముంది…? ఈ అపవాదును ఆమె ఇంకా ఎన్నాళ్ళు భరించాలనుకుంటున్నారు? తెలుసుకుందాం ప‌దండి.  టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ మోస్ట్ చెయిర్ ఆమెదే. పాన్ ఇండియా మూవీ చెయ్యాలన్న థాట్ రాగానే జక్కన్న మనసులో మెదిలిన మొట్టమొదటి పేరు కూడా ఆమెదే. కానీ.. ఇప్పుడు భాగమతి అడ్డా బోసిపోయింది ఎందుకు? నిశ్శబ్దం సినిమా తర్వాత ఆమె నుంచి కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఎందుకు లేనట్టు? అన్న‌ది ఫ్యాన్స్ మ‌దిలో ప్ర‌శ్న .

అజిత్ హీరోగా తనతో ఎన్నై ఆరిందాళ్ మూవీ చేసిన గౌతమ్ మీనన్ కి మరో రెండు సినిమాలు చేస్తానని మాటిచ్చారు అనుష్క. నిశ్శబ్దం మూవీ ప్రమోషన్ టైంలో ఓపెన్ గా చెప్పిన మాట ఇది. తర్వాత యువీ క్రియేషన్స్ బేనర్ పై ఒక మూవీకి సైన్ చేశారు స్వీటీ. కొత్త దర్శకుడు చేయబోయే ఈ మూవీలో నవీన్ పోలిశెట్టి కూడా వుంటారన్నది టాక్. ఇవి కాకుండా.. లేటెస్ట్ గా ఒక ఇంటర్నేషనల్ OTT కంపెనీ… అనుష్కను అప్రోచ్ అయింది. టాలీవుడ్ లో ఒక టాప్ డైరెక్టర్ రాసిన కథతో అనుష్క లీడ్ రోల్ తో ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోంది సదరు డిజిటల్ సంస్థ. ఇలా చేతినిండా అవకాశాలున్నా.. ఒక్కటీ మెటీరియలైజ్ కాకపోవడానికి కారణం ఏంటి చెప్మా అనేది స్వీటీ ఫాలోయర్ల సందేహం.

గతంలో ఒకవైపు బాహుబలి ప్రొడక్షన్ వర్క్ నడుస్తుండగానే.. మరోవైపు వరసబెట్టి మేకోవర్లు అవుతూ రెండుమూడు సినిమాల్లో చేశారు దేవసేన. ఇప్పుడు మాత్రం ఆ దూకుడు ఎందుకు చూపించలేకపోతున్నారు.నిదానమే ప్రధానం అనే ఫార్ములాకే టర్న్ తీసుకున్నారట స్వీటీ. కోవిడ్ సిట్యువేషన్ శాంతించాకయినా.. అరుంధతి ఆన్ స్క్రీన్ అప్పియరెన్స్ దక్కుతుందన్నది అభిమానుల ఆశ.

Also Read:  తారక్ యోగక్షేమాలు ఫోన్ ద్వారా తెలుసుకున్న మెగాస్టార్.. ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడన్న చిరు ..

 వరుస ఆఫర్లతో బిజీగా మారిన ఉప్పెన బ్యూటీ.. ఆ స్టార్ డైరెక్టర్ కు నో చెప్పిందట..