Tollywood News: క‌రోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. టాలీవుడ్ కు భారీ లాస్.. పాపం నిర్మాత‌లు

కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకి విజృభిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌లు, రిలీజ్‌లు ఆగిపోయాయి. మరో నాలుగైదు నెలల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయి అంచనా వేస్తున్నారు.

Tollywood News: క‌రోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. టాలీవుడ్ కు భారీ లాస్.. పాపం నిర్మాత‌లు
Tollywood
Follow us

|

Updated on: May 12, 2021 | 6:10 PM

కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకి విజృభిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌లు, రిలీజ్‌లు ఆగిపోయాయి. మరో నాలుగైదు నెలల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయి అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇండస్ట్రీకి భారీ నష్టాలు తప్పేలా లేవు. ముఖ్యంగా ఈ నాలుగు నెలల టైంలో భారీ బడ్జెట్ పాన్‌ ఇండియా సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అవి వాయిదా పడితే ఆ ఎఫెక్ట్ తరువాతి సీజన్ల మీద కూడా ఉంటుందంటున్నారు విశ్లేషకులు. మేలో రిలీజ్ కావాల్సిన ఆచార్య, నారప్ప వెనక్కెళ్లిపోయారు. బాలయ్య, రవితేజతో పాటు యంగ్ హీరోలు కూడా తమ సినిమాలను వాయిదా వేసేశారు. పరిస్థితులు చక్కబడితే థియేటర్లలోకి రావాలని ఎదురుచూస్తున్నారు. మరి ఆ రోజులు వచ్చేది ఎప్పుడూ?. ఈ విషయంలో విశ్లేషకుల అంచనాలు ఇండస్ట్రీ పెద్దలకే కాదు అభిమానులకు కూడా షాక్ ఇస్తున్నాయి.

ఏప్రిల్‌లో థియేటర్ల దగ్గర కాస్త సందడి కనిపించినా… మేలో మాత్రం పూర్తిగా మూతపడ్డాయి. ఈ టైంలో సీనియర్‌ హీరోల సినిమాలు వాయిదా పడటంతో నష్టాలు కూడా భారీగానే ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఆచార్య, నారప్ప, అఖండ, ఖిలాడీ లాంటి సినిమాలు వాయిదా పడటం వల్ల 300 కోట్ల వరకు లాస్‌ అయ్యారని లెక్కలేస్తున్నారు. జూన్‌ నెలలోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. భారీ సినిమాలేవి లేకపోయినా ఆకాశవాణి, రొమాంటిక్‌ లాంటి సినిమాలతో జూన్‌ క్యాలెండర్‌ కూడా ఫుల్‌గానే కనిపించింది. కానీ ఇప్పడు ఆ సినిమాలు కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి. ఈ ప్రభావం మరింత కాలం కొనసాగి.. జూలైలోనూ ఇదే పరిస్థితి ఉంటే నష్టాలు మరింత భారీగా ఉంటాయన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.

జూలై నెలలో రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. 16న కేజీఎఫ్‌ చాప్టర్ 2, 30న రాధేశ్యామ్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. కానీ విశ్లేషకుల అంచనా ప్రకారం అది కూడా సాధ్యపడేలా లేదు. నాలుగైదు నెలల పాటు సెకండ్ వేవ్‌ ఎఫెక్ట్ ఉంటుందన్న లెక్కలతో ఈ రెండు భారీ చిత్రాలు కూడా వాయిదా పడక తప్పదని తెలుస్తోంది. అదే జరిగితే రెండు సినిమాలు కలిపి 700 కోట్ల వరకు ఇండస్ట్రీ లాస్‌ అవుతుందన్నది ఓ అంచనా. అంతేకాదు నాలుగైదు నెలల పాటు వాయిదా పడ్డ సినిమాలకు తరువాత రిలీజ్‌ డేట్‌ దొరకటం కూడా కష్టమే. మరి ఈ కష్టాల నుంచి ఇండస్ట్రీ ఎప్పటికి కోలుకుంటుందో చూడాలి.

Also Read:  వరుస ఆఫర్లతో బిజీగా మారిన ఉప్పెన బ్యూటీ.. ఆ స్టార్ డైరెక్టర్ కు నో చెప్పిందట..

ఎన్నో సినిమాలు ఫైన‌ల‌య్యాయి.. కానీ ఒక్క‌టి కూడా ప‌ట్టాలెక్క‌డం లేదు.. ఏంటి స్వీటీ సంగ‌తి..!

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..