AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi : మెగాస్టార్ సినిమాకు మళ్లీ దర్శకుడు మారనున్నాడా.. లూసిఫర్ రీమేక్ కు స్క్రిప్ట్ కష్ఠాలు..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం  దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది..

Chiranjeevi : మెగాస్టార్ సినిమాకు మళ్లీ దర్శకుడు మారనున్నాడా.. లూసిఫర్ రీమేక్ కు స్క్రిప్ట్ కష్ఠాలు..
Rajeev Rayala
|

Updated on: May 12, 2021 | 2:27 PM

Share

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం  దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. ఈ సినిమా మెగాస్టార్ తోపాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్.. చరణ్ సరసన పూజాహెగ్డే నటిస్తుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి వరుస  చేస్తున్నారు. ఇప్పటికే మెహర్ రమేష్ తో వేదాళం సినిమాను రీమేక్ చేస్తున్నాడు చిరు. తమిళ్ లో అజిత్ నటించిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో పాటు మలయాళం లో మంచి విజయం సాధించిన లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు మెగాస్టార్.

ఈ రీమేక్ కు ముందుగా సాహో  దర్శకుడు సుజిత్ ను అనుకున్నారు. కానీ ఈ కుర్ర డైరెక్టర్ సినిమాలో చేసిన మార్పులు మెగాస్టార్ కు నచ్చక పోవడంతో సుజిత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దాంతో `తని ఒరువన్` ఫేం మోహన్ రాజాని దర్శకుడిగా ఎంపిక చేశారు. అతడు ప్రస్తుతం స్క్రిప్టు పనుల్లో ఉన్నారు. పలుమార్లు చిరుతో స్క్రిప్టు విషయం చర్చించినా కానీ ఆయన పూర్తిగా సంతృప్తి చెందలేదని రకరకాల మార్పులు సూచించారని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఎంత కథలో మార్పులు చేసినా మెగాస్టార్ ను పూర్తి స్థాయిలో మెప్పించలేక పోతున్నాడట మోహన్ రాజా. దాంతో ఈ రీమేక్ ను మరో దర్శకుడి చేతిలో పెట్టాలని మెగాస్టార్ భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. లూసీఫర్ స్క్రిప్టును తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చడం అంత సులువైన విషయం కాదు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మన నేటివిటీకి తగ్గట్టు మార్చాలి. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్న ఈ రూమర్స్ పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Movies In OTT: వినోదాల పండగ మళ్లీ షూరు.. ఈసారి ఓటీటీలో అలరించనున్న సినిమాలు ఇవే..

Allu Arjun: బన్నీ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. కరోనాను జయించిన అల్లు అర్జున్.. అఫీషియల్ ట్వీట్..

నేను విసిగిపోయాను.. ఇలాంటి రూమర్స్ గురించి ఏం చెప్పాలో తెలియడంలేదు.. మరణవార్తలపై స్పందించిన శక్తిమాన్ నటుడు..

Follow Us
కారులో ఏసీ ఆన్ చేసి నిద్రపోతున్నారా? అది మీకు సైలెంట్ కిల్లర్
కారులో ఏసీ ఆన్ చేసి నిద్రపోతున్నారా? అది మీకు సైలెంట్ కిల్లర్
ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే!
ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే!
సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం..
OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే
OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!