AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shyam Singha Roy movie: ఈసారి డిటెక్టివ్ గా మారి నవ్వులు పూయించనున్న నాని..

నేచురల్ స్టార్ నాని ఫుల్ జోరు మీదున్నాడు.  ప్రస్తుతం వరుస సినినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్పటికే టక్  జగదీష్ సినిమాను పూర్తి చేసాడు నాని...

Shyam Singha Roy movie: ఈసారి డిటెక్టివ్ గా మారి నవ్వులు పూయించనున్న నాని..
Rajeev Rayala
|

Updated on: May 12, 2021 | 5:35 PM

Share

Shyam Singha Roy movie: నేచురల్ స్టార్ నాని ఫుల్ జోరు మీదున్నాడు.  ప్రస్తుతం వరుస సినినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్పటికే టక్  జగదీష్ సినిమాను పూర్తి చేసాడు నాని. శివ  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకీర్తన్ తో సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమాకు శ్యామ్ సింగరాయ్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి , ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా సినిమాలు షూటింగులు ఆపేసుకున్నాయి. టాలీవుడ్ లో దాదాపు అన్ని సినిమాల షూటింగులు ఆగిపోయినట్టేనని భావిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో చాలా మంది వైరస్ బారిన పడుతున్నారు. షూటింగులు ఆపేసి ఇళ్లలోనే రెస్ట్ తీసుకుంటున్నారు.  కానీ నాని మాత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ మాత్రం నాన్ స్టాప్ గా షూటింగు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు షూటింగ్ ని తప్పనిసరై ఆపాల్సిన పరిస్థితి వచ్చింది.. నిహారిక ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.  పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలోసరికొత్త లుక్ లో కనిపించనున్నాడునాని. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఇందులో నాని డిక్టెటివ్ పాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదో కామెడీ అండ్ థ్రిల్లింగ్ డిటెక్టివ్ స్టోరీ అని అంటున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసరాల్లో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేశారు. ఇది నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pooja Bedi: కూతురి ప్రేమాయణంపై బాలీవుడ్ సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్.. అతడితో..

Mahesh Babu: మహేష్ కోసం అనీల్ రావిపూడి అదిరిపోయే స్క్రిప్ట్.. క్రికెట్ కోచ్ గా సూపర్ స్టార్

Chiranjeevi : మెగాస్టార్ సినిమాకు మళ్లీ దర్శకుడు మారనున్నాడా.. లూసిఫర్ రీమేక్ కు స్క్రిప్ట్ కష్ఠాలు..

Follow Us
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్