AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ కోసం అనీల్ రావిపూడి అదిరిపోయే స్క్రిప్ట్.. క్రికెట్ కోచ్ గా సూపర్ స్టార్

టాలీవుడ్ లో సక్సెఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి. వరుసగా అనీల్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి.

Mahesh Babu: మహేష్ కోసం అనీల్ రావిపూడి అదిరిపోయే స్క్రిప్ట్.. క్రికెట్ కోచ్ గా సూపర్ స్టార్
Rajeev Rayala
|

Updated on: May 12, 2021 | 3:00 PM

Share

Mahesh Babu: టాలీవుడ్ లో సక్సెఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి. వరుసగా అనీల్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన అనీల్. ఆతర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబూతో సినిమా చేసాడు. సరిలేరు నీకెవ్వరు అని టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మహేష్ కెరియర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ప్రస్తుతం అనీల్ వెంకటేష్, వరుణ్ తేజ్ లతో కలిసి ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో  సినిమా చేయబోతున్నాడు అనీల్.

ఇటీవల మహేష్ తో మరో సినిమా చేయబోతున్న అని క్లారిటీ ఇచ్చాడు అనీల్. అయిత్ అనీల్ మహేష్ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇందులో మహేష్ క్రికెట్ కోచ్ గా కనిపించనున్నాడని అంటున్నారు. క్రీడా నేపథ్య చిత్రమిదని తెలుస్తుంది. అవ్వదలనికి స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ మూవీనే అయినప్పటికీ అనీల్ మార్క్ కామెడీ ఉండనుందట. సరిలేరు నీకెవ్వరు లో మహేష్ ఆర్మీ ఆఫీసర్ అనగానే సీరియస్ యాక్షన్ స్టోరీ అనుకున్నారు. కానీ ఆ తర్వాత అనీల్ మార్క్ వినోదంతో అలరించింది ఈ సినిమా. ఇక మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తిసురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

నేను విసిగిపోయాను.. ఇలాంటి రూమర్స్ గురించి ఏం చెప్పాలో తెలియడంలేదు.. మరణవార్తలపై స్పందించిన శక్తిమాన్ నటుడు..

Chiranjeevi : మెగాస్టార్ సినిమాకు మళ్లీ దర్శకుడు మారనున్నాడా.. లూసిఫర్ రీమేక్ కు స్క్రిప్ట్ కష్ఠాలు..

Rakul Preet Singh: తెలుగులో తగ్గిన రకుల్ జోరు.. ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ ఆ సినిమా పైనే..

Follow Us
ఆపరేషన్‌ "ఆమ్లెట్‌'' పోలీసుల అండర్‌కవర్‌..
ఆపరేషన్‌
500 లీటర్ల పెట్రోల్‌తో భారీ బ్లాస్ట్‌ !! క్లైమాక్స్‌ అదిరింది !!
500 లీటర్ల పెట్రోల్‌తో భారీ బ్లాస్ట్‌ !! క్లైమాక్స్‌ అదిరింది !!
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
ఛీ.. వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా?.. ఇతను ఏం చేస్తున్నాడో చూడండి
ఛీ.. వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా?.. ఇతను ఏం చేస్తున్నాడో చూడండి
ఒక్క వారం రోజులు ఓపిక పట్టి ఉంటే.. ఆ అమ్మాయి బతికేది
ఒక్క వారం రోజులు ఓపిక పట్టి ఉంటే.. ఆ అమ్మాయి బతికేది
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఎండలో పెట్రోల్ కొట్టిస్తే మైలేజీ తగ్గుతుందా..?
ఎండలో పెట్రోల్ కొట్టిస్తే మైలేజీ తగ్గుతుందా..?
ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
టోల్ చెల్లింపుల్లో కొత్త వ్యవస్థ.. ఇక నుంచి ఆగాల్సిన పనే లేదు..
టోల్ చెల్లింపుల్లో కొత్త వ్యవస్థ.. ఇక నుంచి ఆగాల్సిన పనే లేదు..
పాములవాడి చేతిలోంచి జారిన నాగుపాము..టూరిస్ట్ ప్యాంటులో దూరింది
పాములవాడి చేతిలోంచి జారిన నాగుపాము..టూరిస్ట్ ప్యాంటులో దూరింది