Uppena Vaishnav Tej: మెగా హీరో సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్న నాగార్జున.. నూతన దర్శకుడితో…

Uppena Vaishnav Tej New Movie: 'ఉప్పెన' చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌. మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్ లైన్‌ ఉన్నప్పటికీ ఈ సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను...

Uppena Vaishnav Tej: మెగా హీరో సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్న నాగార్జున.. నూతన దర్శకుడితో...
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 27, 2021 | 1:44 PM

Uppena Vaishnav Tej New Movie: ‘ఉప్పెన’ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌. మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్ లైన్‌ ఉన్నప్పటికీ ఈ సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడీ హీరో. తొలి సినిమానే అయినప్పటికీ సహజ నటనతో సినిమా విషయంలో కీలకపోత్ర పోషించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా విజయంతో వైష్ణవ్‌ చుట్టూ దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ యంగ్‌ హీరోతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వైష్ణవ్‌ ఇప్పటికే పలు సినిమాలను ఓకే కూడా చేశాడు. ఇక క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కికన సినిమా ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉంది. కొండపాలం అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదలవక ముందే వైష్ణవ్‌ కొన్ని సినిమాలకు సైన్‌ చేసిటనట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్‌ ఓ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘మనం ఎంటర్‌టైన్‌ మెంట్స్‌’ బ్యానర్‌పై ఈ సినిమాను నాగార్జున నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా నాగార్జున మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడని సమాచారం. ఇక ఉప్పెన సినిమాకు దర్శకత్వం వహించిన బుచ్చిబాబుకు కూడా అదే తొలి సినిమా అనే విషయం తెలిసిందే. మరి అక్కినేని వారి నిర్మాణంలో మెగా వారి అబ్బాయి నటించబోయే ఈ సినిమా ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. వైష్ణవ్‌ తేజ్‌ నిర్మాత భోగవల్లి ప్రసాద్‌తో కూడా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా నూతన దర్శకుడే తెరకెక్కిస్తుండడం విశేషం.

Also Read: Priya Prakash Varrier : కన్ను గీటి కుర్రాళ్లందరినీ తన మత్తులో పడేసి.. తాను మాత్రం ఇలా పడిందేంటి..!

Naandhi movie : బ్రేక్ ఈవెన్ దాటి దూసుకుపోతున్న నరేష్ ‘నాంది’.. ఏడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!