Naandhi movie : బ్రేక్ ఈవెన్ దాటి దూసుకుపోతున్న నరేష్ ‘నాంది’.. ఏడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు ‘అల్లరి’ నరేష్..  కానీ ఇప్పుడు తనలోని నటుడిని బయటకు తీసి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంనేందుకు ప్రయత్నించారు.

  • Rajeev Rayala
  • Publish Date - 9:59 pm, Fri, 26 February 21
Naandhi movie : బ్రేక్ ఈవెన్  దాటి దూసుకుపోతున్న నరేష్ 'నాంది'.. ఏడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

Naandhi movie collactions : తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు ‘అల్లరి’ నరేష్..  కానీ ఇప్పుడు తనలోని నటుడిని బయటకు తీసి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంనేందుకు ప్రయత్నించారు. అప్రయత్నం విజయవంతం అయ్యింది. ప్రతిఫలం నాంది సినిమాగా నిలించింది.  ‘మహర్షి’ లో మహేష్ స్నేహితుడిగా ఆకట్టుకున్న నరేష్ కొంత గ్యాప్ తర్వాత తనకున్న కామెడీ ఇమేజ్‌ని పక్కన పెట్టి  ‘నాంది’ అనే ఓ ఢిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్ళు రాబడుతోంది. హిట్లు ఫ్లాపులను ఏ మాత్రం లెక్క చేయకుండా సినిమాలు చేస్తూ అలరించారు నరేష్ . దాదాపు 50కు పైగా సినిమా చేసిన నరేష్ కెరియర్ లో కొన్ని హిట్ అయితే మరి కొన్ని ఫట్ అన్నాయి. అయితే చాలాకాలం నుంచి సరైన్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నరేష్ కు నాంది ఆ కాలిని తీర్చిందనే చెప్పాలి. దాదాపు ఎనిమిదేళ్లు హిట్ రుచిచూడని నరేష్ ఊహించని ఈవిజయంతో ఇటీవల కన్నీటి పర్యంతం అయ్యారు కూడా.. అల్లరి నరేశ్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన నాంది సినిమాను దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మించగా..శ్రీచరణ పాకాల సంగీతం అందించారు. కోలీవుడ్  హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర నటించి మెప్పించారు.

కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల నాంది కి దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన నాంది అద్భుతమైన స్పందన అందుకుంటోంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ‘నాంది’ సినిమా 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకొనిలాభాల బాటలోకి వచ్చేసిందని తెలుస్తుంది. నాంది’ 7వ రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాం ఏరియాలో 5లక్షలు – సీడెడ్ 1.7లక్షలు – ఉత్తరాంధ్ర 2లక్షలు – ఈస్ట్ 1.6లక్షలు – వెస్ట్ 1.2లక్షలు – గుంటూరు 1.4లక్షలు – కృష్ణా 1.6లక్షలు – నెల్లూరు 0.8లక్షలు వసూలు చేసింది. మొత్తం మీద 7వ రోజు ‘నాంది’ 0.15 కోట్లు షేర్ రాబట్టింది. ఈ 7రోజుల్లో కలిపి వరల్డ్ వైడ్ గా 3.47 కోట్ల షేర్స్ ను అందుకుని 6.40కోట్లు గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Uppena Movie : కొనసాగుతున్న ‘ఉప్పెన’మూవీ మానియా.. ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో..

Aakaasam Nee Haddhu Ra : ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. ఆనందంలో చిత్రయూనిట్.. ఏ ఏ విభాగాల్లో అంటే..

Kangana Ranaut : ఆ స్టార్ హీరోయిన్ కంటే నేను ఎందులోనూ తక్కువ కాదు.. ఇప్పుడు నేనే టాప్ అంటున్న కంగనా..

Sreekaram Movie : ‘కనివిని ఎరుగని కదలిక మొదలయింది’.. ఆకట్టుకుంటున్న శ్రీకారం టైటిల్ సాంగ్