AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut : ఆ స్టార్ హీరోయిన్ కంటే నేను ఎందులోనూ తక్కువ కాదు.. ఇప్పుడు నేనే టాప్ అంటున్న కంగనా..

కాంట్రవర్సీ క్వీన్ గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ కంగనా సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువ ఫెమస్ అయ్యింది. సుశాంత్ మరణమే తర్వాత మరింత రెచ్చిపోయిన ఈ అమ్మడు బాలీవుడ్ పెద్దలపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి సెన్సేషనల్ అయ్యింది.

Kangana Ranaut : ఆ స్టార్ హీరోయిన్ కంటే నేను ఎందులోనూ తక్కువ కాదు.. ఇప్పుడు నేనే టాప్ అంటున్న కంగనా..
Rajeev Rayala
|

Updated on: Feb 26, 2021 | 8:28 PM

Share

Kangana Ranaut : కాంట్రవర్సీ క్వీన్ గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ కంగనా సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువ ఫెమస్ అయ్యింది. సుశాంత్ మరణమే తర్వాత మరింత రెచ్చిపోయిన ఈ అమ్మడు బాలీవుడ్ పెద్దలపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి సెన్సేషనల్ అయ్యింది. ఆతర్వాత ఏకంగా రాజకీయ నాయకులను ఛాలెంజ్ చేస్తూ  మరింత రచ్చచేసింది . ఇలా నిత్యం వివాదాల్లో ఉండే కంగనా.. ఇప్పుడు స్వయం ప్రకటిత బాబాలా.. తనను తాను మరో గొప్ప హీరోయిన్‌తో పోల్చుకుంది. ఆ స్టార్ హీరోయిన్ కి నేను ఏమాత్రం తీసిపోను అంటూ పోల్చుకుంటుంది. పోల్చుకోవడమే కాదు..  కామెడీ విత్ గ్లామర్‌ వలకబోయడంలో.. ఇప్పుడు నేనే టాప్‌.. మీరు ఫిక్సై పోండంటూ.. బల్లగుద్ది మరీ చెప్తుంది. ఇంతకీ కంగనా పోల్చుకుంటున్న ఆ స్టార్‌ ఎవరనుకుంటున్నారా..? ఆమే అతిలోక సుందరి శ్రీదేవి.

ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో కంగన కథానాయికగా నటించిన `తను వెడ్స్‌ మను` విడుదలై పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కంగన ఆ సినిమాను గుర్తు చేసుకుంది. `నేను కెరీర్ ఆరంభం నుంచి ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించాను. అయితే `తను వెడ్స్ మను` నా కెరీర్‌ను మార్చేసింది. ఆ సినిమాలో విభిన్నమైన కథ, నా నాటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలో కామెడీని అద్భుతంగా పండించగలిగాను. దిగ్గజ నటి శ్రీదేవి తర్వాత అంతలా కామెడీ పండించగలిగింది నేనేన`ని కంగన చెప్పేసింది.

ఇక కంగనా దివంగత నటి, తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్లో నటిస్తోంది. ఈ సినిమా కోసం బరువు కూడా పెరిగింది కంగనా…అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ 23న ‘తలైవి’ సినిమాను విడుదల చేయనున్నట్లు మూవీమేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీంతోపాటు తలైవి టీజర్‌ను కూడా రిలీజ్‌ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘House Arrest’ Movie : శ్రీనివాసరెడ్డి, సప్తగిరి ‘హౌస్ అరెస్ట్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, టీజర్ రిలీజ్ లైవ్

Roberrt Movie Live : ప్రీరిలీజ్ ఈవెంట్… భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ‘రాబర్ట్’..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!