AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priya Prakash Varrier : కన్ను గీటి కుర్రాళ్లందరినీ తన మత్తులో పడేసి.. తాను మాత్రం ఇలా పడిందేంటి..!

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం 'చెక్'. ఈ సినిమా ఫిబ్రవరి 26న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ..

Priya Prakash Varrier : కన్ను గీటి కుర్రాళ్లందరినీ తన మత్తులో పడేసి.. తాను మాత్రం ఇలా పడిందేంటి..!
Rajeev Rayala
|

Updated on: Feb 27, 2021 | 8:16 AM

Share

Priya Prakash Varrier : యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘చెక్'(Check Movie). ఈ సినిమా ఫిబ్రవరి 26న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. రకుల్ ప్రీత్ (Rakul Preet Singh) కీలక పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాతో కన్ను గీటి కుర్రాళ్లందరినీ తన మత్తులో కింద పడేసిన వింక్‌ పాప ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

ఈ అమ్మడు తన నవ్వుతో గ్లామర్ తో కుర్రాళ్లను పడెయ్యడమే కాదు.. తను కూడా కింద పడతా అంటూ..ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ మ్యాటర్‌ని తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది ఈ కేరళ కుట్టి.. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే..!

నితిన్(Nithiin)  చెక్ సినిమా చెస్‌ గేమ్‌ నేపథ్యంలో  రూపొందించాడు దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. అయితే ఈ సినిమాలో కోసం గోవాలో ఓ పాటను షూట్‌ చేస్తుండగా.. ఈ  వింక్‌ పాప.. నితిన్‌ వీపు ఎక్కబోయి.. ఎల్లెకిల పడిపోయింది. వెంటనే యూనిట్ సభ్యులందరూ వచ్చి ఆమెను పైకి లేపారు. అమ్మడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పుడు ఈ వీడియో ను ప్రియా తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఈ వీడియా నా జీవితాన్ని రిప్రజెంట్ చేస్తుందని.. నేను ఎదగాలనుకుంటున్న ప్రతీసారి నన్ను కిందకు పడేస్తుంటుందని రాసుకొచ్చింది. దాంతో ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక  చెక్ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతుంది. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా నితిన్ కు మరో హిట్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తిసురేష్  హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Deverakonda : మరోసారి జతకట్టనున్న క్రేజీ జంట.. విజయ్‌‌‌‌‌దేవరకొండ నెక్స్ట్ సినిమాలో ఆ హీరోయిన్

Naandhi movie : బ్రేక్ ఈవెన్ దాటి దూసుకుపోతున్న నరేష్ ‘నాంది’.. ఏడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి