Mega Hero Vaishnav Tej : ‘ఉప్పెన’లా ఎగసిపడుతున్న ఆఫర్లు.. రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో..
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో తన రూటే సపరేట్ అంటూ సక్సెస్ ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే సంచలన విజయం సాధించాడు...
Vaishnav Tej Remuneration : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో తన రూటే సపరేట్ అంటూ సక్సెస్ ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే సంచలన విజయం సాధించాడు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఉప్పెనతో వైష్ణవ్ సముద్రమంత సక్సెస్ ను అందుకున్నాడు. ఇంత వరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్త్నునాడు వైష్ణవ్. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. ఒక డెబ్యూ హీరోల పేరిట బాలీవుడ్‌లో ఉన్న రికార్డ్‌ను కూడా వైష్ణవ్ దాటేశాడు.
‘ఉప్పెన’ సినిమాకు సుకుమార్ ప్రియా శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతిశెట్టి నటించగా.. తమిళస్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీమేకర్స్ తో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మించాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ భారీ వసూళ్లను రాబడుతుంది.
ఇదిలా ఉంటే ‘ఉప్పెన’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో కోలీవుడ, బాలీవుడ్‌లోకి కూడా రీమేక్ చేయడానికి సన్నహాలు మొదలు పెట్టారు. తమిళ్ లో దళపతి విజయ్ కుమారుడితో ఈ సినిమాను రీమేక్ చేయాలని స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో కూడా దర్శక నిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక మొదటి సినిమా రిలీజ్ కాక ముందే వైష్ణవ్ తన సెకండ్ సినిమాను కంప్లీట్ చేసాడు. టాప్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేసాడు వైష్ణవ్. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాను పూర్తి చేసాడు క్రిష్ కేవలం 60 రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేసాడని తెలుస్తుంది. ఈ సినిమా రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది.
ఇప్పుడు ఈ మెగా హీరో అక్కినేని వారి బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ మూడవ సినిమా రాబోతుందని ఫిలింనగర్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే మరోవైపు బడా ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ తో వైష్ణవ్ మూడో సినిమా చేస్తున్నాడని కూడా టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే వైష్ణవ్ తేజ్ తో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారని టాక్. ఈ క్రమంలోనే తన రెమ్యునరేషన్ ను కూడా పెంచేసాడంట ఈ మెగా హీరో. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి రూ .75 లక్షల పారితోషికం అందుకున్నారట వైష్ణవ్ తేజ్. అలాగే బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించే చిత్రాన్ని రెమ్యునరేషన్ గా వైష్ణవ్ రూ 2.50 కోట్లు వసూలు చేస్తున్నాడని అనుకుంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Priya Prakash Varrier : కన్ను గీటి కుర్రాళ్లందరినీ తన మత్తులో పడేసి.. తాను మాత్రం ఇలా పడిందేంటి..!
Vijay Deverakonda : మరోసారి జతకట్టనున్న క్రేజీ జంట.. విజయ్‌దేవరకొండ నెక్స్ట్ సినిమాలో ఆ హీరోయిన్