Vijay Deverakonda : మరోసారి జతకట్టనున్న క్రేజీ జంట.. విజయ్‌‌‌‌‌దేవరకొండ నెక్స్ట్ సినిమాలో ఆ హీరోయిన్

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్ ఉన్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Vijay Deverakonda : మరోసారి జతకట్టనున్న క్రేజీ జంట.. విజయ్‌‌‌‌‌దేవరకొండ నెక్స్ట్ సినిమాలో ఆ హీరోయిన్
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 27, 2021 | 7:16 AM

Vijay devarakonda with rashmika mandanna : టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్ ఉన్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా టాలీవుడ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాతో యూత్ లో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ రౌడీ హీరో యాటిట్యూడ్ కి కుర్రకారు ఫిదా అయిపోయారు.

ఆతర్వాత వరుసగా సైనికుమాలు చేస్తూ… బిజీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో రొమాన్స్ చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు పూరి. ఇదిలా ఉంటే విజెబ్ నెక్స్ట్ సినిమా గురించి ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. విజయ్ తో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలో నటించిన అందాల భామ రష్మిక మందన ఇప్పుడు మరోసారి విజయ్ తో జతకట్టనుందట.

ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆతర్వాత వరుస విజయాలను అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పలో హీరోయిన్ గా చేస్తుంది రష్మిక. ఈ సినిమాలో గిరిజన యువతి పాత్రలో కనిపించనుంది. ఆగస్టు 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో విజయ్, రష్మిక కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

అయితే పుష్ప సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ చెప్పిన లైన్ నచ్చడంతో వెంటనే విజయ్ ఓకే చెప్పాడట. దాంతో పుష్పసినిమాతో పాటు ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేస్తున్నాడు సుక్కు. మరోవైపు లైగర్ శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.  శివ నిర్వాణ సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాలో రష్మికను హీరోయిన్ గా ఎంపిక చేయాలనీ చూస్తున్నారట. పుష్ప సినిమా షూటింగ్ లో రష్మిక నటనకు ఫిదా అయిన సుక్కు . తన నెక్స్ట్ సినిమాకు కూడా ఈ అమ్మడిని తీసుకోవాలని చూస్తున్నాడని ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Naandhi movie : బ్రేక్ ఈవెన్ దాటి దూసుకుపోతున్న నరేష్ ‘నాంది’.. ఏడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

Uppena Movie : కొనసాగుతున్న ‘ఉప్పెన’మూవీ మానియా.. ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో..

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..