AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppena Movie : కొనసాగుతున్న ‘ఉప్పెన’మూవీ మానియా.. ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే కానీ అందరిలో తాను ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్.  వైష్ణవ్ తేజ్‌ హీరోగా.. కృతి శెట్టి హీరోయిన్‌గా.. సనా బుచ్చి బాబు డైరెక్షన్లో

Uppena Movie  : కొనసాగుతున్న 'ఉప్పెన'మూవీ మానియా.. ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో..
Rajeev Rayala
|

Updated on: Feb 26, 2021 | 9:37 PM

Share

Uppena Movie Making : మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే కానీ అందరిలో తాను ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ.  వైష్ణవ్ తేజ్‌ హీరోగా.. కృతి శెట్టి హీరోయిన్‌గా.. సనా బుచ్చి బాబు డైరెక్షన్లో వచ్చిన చిత్రం ‘ఉప్పెన’. రిలీజైన నాటి నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుని రికార్డులు కొల్ల కొడుతుంది ఈ చిత్రం. ఇక హీరోగా ఇంట్రోడ్యూస్ అయిన వైష్ణవ్‌ తేజను హీరోగా నిలబెట్టడమే కాదు.. హీరోయిన్‌ కృతికి వరుస అవకాశాలను తీసుకొచ్చేలా చేసింది ఈ సినిమా. కరోనా కాలం తరవాత విడుదలైన అన్ని థియేటర్లలోనూ.. ప్రేక్షకాధరణను పొంది. అటు తమిళ్లోకి.. ఇటు హిందీలోకి రిమేక్‌ కాబోతోంది ఉప్పెన సినిమా.

ఇక ఫిబ్రవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఉప్పెన’ మూవీ తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకొని  విజయవంతంగా దూసుకుపోతుంది. ఇప్పటికే భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును ‘ఉప్పెన’ బద్దలుకొట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఇండియన్ సినిమాలో ఒక డెబ్యూ హీరోకి హయ్యస్ట్ గ్రాసర్‌గా ‘ఉప్పెన’ మూవీ నిలిచింది.

ఇక ఈ సినిమా విడుదలై ఇన్ని రోజులవుతున్నా.. యూట్యూబ్‌లో ఉప్పెన మానియా ఇంకా తగ్గడంలేదు. కరోనా ముందు దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ బుచ్చి బాబు.. ఇష్క్‌ సిఫాయా అన్న పాట మేకింగ్ తో యూట్యూబ్‌లో స్టార్ట్‌ అయిన ఉప్పెన సందడి.. ఇక రీసెంట్గా వచ్చిన ఉప్పెన మేకింగ్ వీడియో వరకు కొనసాగుతూనే ఉంది.

అవును రీసెంట్గా ఉప్పెన టీం ఈ సినిమా మానియాను కంటిన్యూ చేయడానికి ఉప్పెన మేకింగ్ వీడియోను రిలీజ్‌ చేసింది. ఇప్పుడా వీడియో.. అందర్నీ అలరిస్తూ.. యూట్యూబ్లో వైరల్గా మారింది. షూటింగ్‌లో హీరో హీరోయిన్‌ల మధ్య ఫన్నీ కన్‌వర్జేషన్‌, విజయ్‌ సేతుపతి.. వైష్ణవ్‌ కి.. కృతి కి యాక్టింగ్ లో ఇస్తున్న మెలకువలు.. సనా బుచ్చిబాబు.. విజయ్ సేతుపతికి క్యారెక్టర్ ఎక్స్‌ప్లేనింగ్ చేస్తున్న విధానం.. వంటి సీన్లు.. ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. వీడియోలో చూపించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aakaasam Nee Haddhu Ra : ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. ఆనందంలో చిత్రయూనిట్.. ఏ ఏ విభాగాల్లో అంటే..

Sreekaram Movie : ‘కనివిని ఎరుగని కదలిక మొదలయింది’.. ఆకట్టుకుంటున్న శ్రీకారం టైటిల్ సాంగ్