AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreekaram Movie : ‘కనివిని ఎరుగని కదలిక మొదలయింది’.. ఆకట్టుకుంటున్న శ్రీకారం టైటిల్ సాంగ్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మంచి స్వింగ్ లో ఉన్నాడు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ యంగ్ హీరో విభిన్న మైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.

Sreekaram Movie : 'కనివిని ఎరుగని కదలిక మొదలయింది'.. ఆకట్టుకుంటున్న శ్రీకారం టైటిల్ సాంగ్
Rajeev Rayala
|

Updated on: Feb 26, 2021 | 8:46 PM

Share

Sreekaram Movie song : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మంచి స్వింగ్ లో ఉన్నాడు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ యంగ్ హీరో విభిన్న మైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు.బి కిషోర్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్ బాగా చదువుకున్న ఓ రైతు పాత్రలో నటిస్తున్నాడు. శర్వా సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా నుండి ఇప్పటికే భలేగుంది బాలా… అనే పాట యూట్యూబ్ ను షేక్ చేసింది. మిలియన్ కొద్దీ వ్యూస్ లక్షల కొద్దీ లైక్స్ తో ఈ పాట మంచి క్రేజ్ ను తెచ్చుకోవడమే కాకుండా సినిమా పైన కూడా మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఆతర్వాత విడుదలైన పాటలు కూడా శ్రోతలను అలరించాయి. ఈ క్రమంలో శ్రీకారం సినిమానుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

‘కనివిని ఎరుగని కదలిక మొదలయింది.. అడుగులో అడుగుగా..’ అంటూ సాగిన ఈ గీతానికి మిక్కీ తనదైన శైలిలో ట్యూన్ అందించారు. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ అద్భుతంగా రాసారు. ఈ పాటను యువ గాయకుడు పృథ్వీ చంద్ర వినసొంపుగా ఆలపించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ‘శ్రీకారం’ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట – గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివరాత్రి కానుకగా మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో శర్వా ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut : ఆ స్టార్ హీరోయిన్ కంటే నేను ఎందులోనూ తక్కువ కాదు.. ఇప్పుడు నేనే టాప్ అంటున్న కంగనా..

‘House Arrest’ Teaser launch Event Live Video : ప్రముఖ కామెడీ నటులు శ్రీ‌నివాస్ రెడ్డి, స‌ప్తగిరి హీరోలుగా ‘హౌస్ అరెస్ట్’

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..