Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upendra – Shiva Rajkumar: క్రేజీ కాంబో.. థియేటర్స్ బద్దలే..! 45 మూవీ టీజర్ చూశారా.?

ఘనంగా శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి పాన్ ఇండియా మూవీ "45" టీజర్ లాంఛ్ జరిగింది.  త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది ఈ సినిమా. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. విభిన్న కథతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. 

Upendra -  Shiva Rajkumar: క్రేజీ కాంబో.. థియేటర్స్ బద్దలే..! 45 మూవీ టీజర్ చూశారా.?
45 Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 16, 2025 | 2:31 PM

శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “45”. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి. ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా “45” సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత ఎం.రమేష్ రెడ్డి మాట్లాడుతూ – మా 45 మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమాను మేమంతా ఇష్టపడి, కష్టపడి చేశాం. మీ సపోర్ట్ మా మూవీకి కావాలి. ఇలాంటి కాన్సెప్ట్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా రాలేదని చెప్పగలను. ఇప్పుడున్న సామాజిక పరిస్థితులకు 45 లాంటి మూవీ కావాలి. సనాతన ధర్మం గురించి ఈ చిత్రంలో అంశాలుంటాయి. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ తో 45 మూవీ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లాంచ్ లో మా మూవీ గురించి మరింత వివరంగా మాట్లాడుతాను. అన్నారు.

దర్శకుడు అర్జున్ జన్యా మాట్లాడుతూ – 45 మూవీని శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టితో చేయడం సంతోషంగా ఉంది. శివరాజ్ కుమార్ గారికి కథ చెప్పినప్పుడు ఈ సినిమాకు నువ్వే డైరెక్షన్ చేయి అని ఎంకరేజ్ చేశారు. ఆయన మాటతోనే ఈ సినిమాకు దర్శకత్వం చేసే కాన్ఫిడెన్స్ వచ్చింది. శివరాజ్ కుమార్ గారు ఈ సినిమాలో ఒక కొత్త తరహా పాత్రలో కనిపిస్తారు. ఆయనకు ఆరోగ్యం బాగా లేకున్నా, ఎంతో సపోర్ట్ చేసి సినిమాలో నటించారు. ఉపేంద్ర గారిని ఎలాంటి పాత్రలోనైనా డైరెక్టర్స్ చూపించగలరు. ఆయన దర్శకులకే దర్శకుడు. 45 మూవీని మూవీని ముందుగా సీజీ, డైలాగ్స్, బీజీఎంతో సహా విజువలైజ్ చేసి, ఆ తర్వాత షూటింగ్ చేశాం. ఈ పద్ధతి వల్ల ఒక్క సీన్ కూడా వేస్టేజ్ ఉండదు , ప్రొడ్యూసర్స్ కు బడ్జెట్ ఆదా అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా గొప్ప దర్శకులు ఉన్నారు. వారు కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నా. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో స్క్రీన్ ప్లే పరంగా కొత్తదనంతో ఉండే చిత్రమిది. అన్నారు.

హీరో ఉపేంద్ర మాట్లాడుతూ – 45 మూవీలో నన్ను చాలా కొత్తగా చూపించారు దర్శకుడు అర్జున్ జన్యా. ఆయన కథ చెప్పేందుకు వచ్చినప్పుడు నేను ఇంట్లో కాజువల్ గా ఉన్నాను. అది చూసి ఈ మూవీలో నా గెటప్ అలాగే ఉండాలని డైరెక్టర్ చెప్పారు. ఈ చిత్రంలో ఓం సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ను ఎంతో క్రియేటివ్ గా ఈ మూవీలో ఉపయోగించారు దర్శకుడు అర్జున్ జన్యా. ఆయన వందకు పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అందులో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. అలాంటి క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రంతో దర్శకుడు కావడం సంతోషంగా ఉంది. శివరాజ్ కుమార్ గారితో ఓం సినిమా రూపొందించాను. ఆ సినిమా షూటింగ్ రెండో రోజే నేను గొప్ప దర్శకుడిని అవుతానని మీడియా ముందు చెప్పారు. శివన్న అలా చెప్పడం చూసి నేను కంగారుపడ్డాను. లేదు నువ్వు దర్శకుడిగా గొప్ప స్థాయికి వెళ్తావని చెప్పారు. ఆయనతో కలిసి ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. 45 మూవీ స్టోరీ ఎంటి, మా క్యారెక్టర్స్ ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఇందులో క్లాస్, మాస్, ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. కూలీ సినిమాలో రజినీకాంత్, నాగార్జున గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. రజినీకాంత్ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. అన్నారు.

హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ – దర్శకుడు అర్జున్ జన్యా 45 సినిమా కథను నాకు నాలుగు నుంచి ఐదు నిమిషాలు చెప్పారు. అలా ఈ సినిమాకు 45 అనే టైటిల్ పెట్టుకున్నాం. కథ చెప్పాక అర్జున్ జన్యా మరో దర్శకుడికి ఎవరికైనా డైరెక్షన్ బాధ్యతలు ఇస్తానని అన్నాడు. ఈ కథకు నువ్వే న్యాయం చేయగలవు అని చెప్పి అర్జున్ ను ఒప్పించాను. ఈ చిత్రంలో ఉపేంద్రతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అతను ఎంతో టాలెంటెడ్. సినిమానే లోకంగా బతుకుతుంటాడు. ఎన్నో విషయాలు ఉపేంద్ర నుంచి నేర్చుకున్నాను. ఈ రోజు రాజ్ బి శెట్టి ఈవెంట్ కు రాలేకపోయారు. 45 సినిమాలో నేను, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ఎవరి పాత్రలదీ పైచేయి కాదు. కథే ఈ సినిమాకు హీరో. కథే మెయిన్ స్కోర్ చేస్తుంది. డైరెక్టర్ అర్జున్ కు మంచి పేరొస్తుంది. కొత్త స్క్రీన్ ప్లేను తెరపై చూస్తారు. ఈ సినిమా షూటింగ్ చివరలో నాకు క్యాన్సర్ అని తెలిసింది. కీమో థెరపీ తీసుకుంటూనే షూటింగ్ చేశాను. నాకు మా మూవీ టీమ్ ఎన్నో మినహాయింపులు ఇస్తాం, మీరు అది చేయొద్దు ఇది చేయొద్దు అని అన్నారు కానీ నేను చేయగలిగినప్పుడు మోసం చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నా క్యారెక్టర్ కు ఉన్న అన్ని రకాల సీన్స్ చేశాను. రామ్ చరణ్ గారితో కలిసి పెద్ది చిత్రంలో నటిస్తున్నాను. చరణ్ వ్యక్తిత్వం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. జైలర్ సినిమాలో నా పాత్రకు అంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. రజినీకాంత్ కోసమే ఆ సినిమా చేశాను. ఇప్పుడు జైలర్ 2లోనూ కనిపించబోతున్నా. అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి
విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి
స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే నన్ను అలా చూస్తున్నారు..
స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే నన్ను అలా చూస్తున్నారు..
పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు
పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు
భర్తని చంపి భార్యని విడిచి ఈ దాడి విషయం మోడీ చెప్పు అన్న ఉగ్రవాది
భర్తని చంపి భార్యని విడిచి ఈ దాడి విషయం మోడీ చెప్పు అన్న ఉగ్రవాది
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం.. అసలా బైక్ ఎవరిదీ?
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం.. అసలా బైక్ ఎవరిదీ?
ఉప్పల్‌లో బ్యాటర్లు vs బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?
ఉప్పల్‌లో బ్యాటర్లు vs బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్
ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు ప్రభావంఏమో
ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు ప్రభావంఏమో
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్.. ఒక్కరోజే ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్.. ఒక్కరోజే ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య!
ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు..
ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..