RRR: ఆర్.ఆర్.ఆర్ నుంచి క్రేజీ అప్‌డేట్.. అదే జరిగితే ఫ్యాన్స్‌కు పండగే !
తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. ఇండియన్ మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ట్రిపులార్. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా...
తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. ఇండియన్ మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ట్రిపులార్. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ భారీ చిత్రం కోసం ఇండస్ట్రీ జనాలు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే కోవిడ్ కారణంగా డిలే అవుతున్న ట్రిపులార్ రిలీజ్ పై.. ఇంట్రస్టింగ్ బజ్.. మీడియా సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ట్రిపులార్ రిలీజ్‌పై టాలీవుడ్ సర్కిల్స్‌లో కొత్త డేట్లు వైరల్ అవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడటంతో ముందు చెప్పినట్టుగా అక్టోబర్‌లో సినిమా రిలీజ్ చేయటం కష్టమే. ఇంకా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ ఇలా చాలా వర్క్ ఉంది. అందుకే ట్రిపులార్ రిలీజ్ అక్టోబర్‌లో అయితే ఉండదని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.
భారీ చిత్రం కావటంతో సరైన సీజన్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరోసారి డేట్ మార్చే అవసరం లేకుండా ఉండేలా… కాస్త ఆలస్యంగానే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఏకంగా 8 నెలల పాటు రిలీజ్ వాయిదా వేసే ప్లాన్‌లో ట్రిపులార్ టీమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్‌లో కాకుండా 2022 సమ్మర్ కానుకగా సినిమాను రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఐడియా. ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తే కలెక్షన్ల పరంగా కూడా సినిమాకు ప్లస్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారట జక్కన్న. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలంటే హరిబరీగా వర్క్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి రిస్క్ లేకుండా లీజర్‌గా సినిమా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు ట్రిపులార్ టీమ్.
అయితే రిలీజ్ డేట్ విషయంలో మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. ఫ్రీడమ్ ఫైటర్స్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా కావటంతో రిపబ్లిక్ డేకి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ఉందట. పేట్రియాటిక్ మూవీ కాబట్టి జనవరి 26న రిలీజ్ చేస్తే సిచ్యుయేషనల్ కూడా సింక్ అవుతుందన్నది మరో వర్షన్. మరి… ఈ డేట్స్‌లో జక్కన్న ఏది ఫైనల్ చేస్తారో చూడాలి.
Also Read: యష్ చెయ్యబోయే నెక్ట్స్ మూవీపై ఇంతవరకూ నో క్లారిటీ.. అయోమయంలో ఫ్యాన్స్
తాజాగా ఓటీటీల్లోకి వచ్చిన కంటెంట్ ఇదే.. సండే రోజున ఫుల్‌గా ఎంజాయ్ చేసేయ్యండి