Yash: యష్ చెయ్యబోయే నెక్ట్స్ మూవీపై ఇంత‌వ‌ర‌కూ నో క్లారిటీ.. అయోమ‌యంలో ఫ్యాన్స్

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగిన ఆ హీరో.. వాట్ నెక్స్ట్‌ అంటే మాత్రం.. దిక్కులు చూస్తున్నారు. కాల్షీట్స్‌ కోసం కో అంటే కోటిమంది క్యూలో వచ్చి నిలబడతారనేది...

Yash: యష్ చెయ్యబోయే నెక్ట్స్ మూవీపై ఇంత‌వ‌ర‌కూ నో క్లారిటీ..  అయోమ‌యంలో ఫ్యాన్స్
Kannada Superstar Kgf Yash
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 20, 2021 | 7:52 AM

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగిన ఆ హీరో.. వాట్ నెక్స్ట్‌ అంటే మాత్రం.. దిక్కులు చూస్తున్నారు. కాల్షీట్స్‌ కోసం కో అంటే కోటిమంది క్యూలో వచ్చి నిలబడతారనేది నిన్నటి మాట. రియాలిటీలో మాత్రం అంత సినిమా వున్నట్టా లేనట్టా? నేను ఎవరి గురించి చెబుతున్నానో మీకు అర్థమవుతోందా..? అదేనండీ… హి ఈజ్‌ నన్‌అదర్‌దేన్.. రాకీ భాయ్..!. సెకండ్‌ వేవ్‌కి ముందే షూటింగ్‌ ఫినిష్ చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో వుంది కేజీఎఫ్ సెకండ్ చాప్టర్‌. రవి బస్రుర్ ట్యూన్స్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ దగ్గరే జాప్యం జరుగుతోందట. సో… కేజీఎఫ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి జస్ట్‌… ప్రమోషన్ పార్ట్ మాత్రమే మిగిలుంది. ఇప్పుడైతే… భార్యాపిల్లలతోనే స్పెండ్ చేస్తున్నారు రాకీభాయ్. ఇంతకీ… యష్ చెయ్యబోయే నెక్ట్స్ మూవీ సంగతేంటి? అన్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

రెండు చాప్టర్లనూ దిగ్విజయంగా ముగించి.. కెజీఎఫ్ ప్రాజెక్ట్‌ నుంచి పూర్తిగా రిలీవ్ అయ్యారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అదే బేనర్‌పై ప్రభాస్‌తో కొత్త సినిమా మొదలుపెట్టి… దాన్ని కూడా సగం దాకా కంప్లీట్ చేశారు. ప్రొడ్యూసర్లు కూడా మిగతా ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెట్టి.. బిజీగా వున్నారు. ఇక.. మిగిలింది కేజీఎఫ్ హీరో యష్ మాత్రమే. మరో కన్నడ డైరెక్టర్ నార్తన్‌తో ఒక మూవీ కమిటైనట్టు వార్తలొచ్చినా.. అదింకా ఫైనలైజ్ కాలేదు. కేజీఎఫ్‌2 ట్రయిలర్‌తో అడిషనల్‌ హైప్ తెచ్చుకుని.. పర్‌ఫెక్ట్‌ పాన్ ఇండియా మెటల్ వుందని ప్రూవ్ చేసుకున్నారు యష్. కానీ.. నార్త్ వైపు నుంచి యష్‌ కోసం ఒక్క ఆఫరైనా వచ్చిన దాఖలా లేదు. తెలుగులో కొందరు టాప్ ప్రొడ్యూసర్లు యష్‌తో టచ్‌లోకొచ్చినప్పటికీ.. ఇంకా ఏదీ మెటీరియలైజ్ కాలేదు. ఒక సినిమా సెట్స్ మీదుండగానే మరో రెండుమూడు సినిమాలకు కాల్షీట్లిచ్చే ఈరోజుల్లో.. ఈ స్టార్ హీరో మాత్రం ఎందుకు సైలెంట్ అయ్యారన్నది ఒక పాన్ ఇండియా ప్రశ్న.

Also Read: తాజాగా ఓటీటీల్లోకి వ‌చ్చిన కంటెంట్ ఇదే.. సండే రోజున ఫుల్‌గా ఎంజాయ్ చేసేయ్యండి

ఫ్యామిలీ మ్యాన్‌-3లో ద‌క్షిణాదికి చెందిన ప్ర‌ముఖ నటుడు.? ఆ విల‌క్ష‌ణ స్టార్ ఏ పాత్ర‌లో న‌టిస్తాడో..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!