Uday Kiran: కన్నీరు పెట్టిస్తున్న ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. చనిపోయే ముందు అంతలా..

ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగ ప్రవేశం

Uday Kiran: కన్నీరు పెట్టిస్తున్న ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. చనిపోయే ముందు అంతలా..
Uday Kiran

ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగ ప్రవేశం చేసి స్టార్ హీరోగా రికార్డ్స్ సృష్టించాడు. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని సినీ పరిశ్రమలో సంచలనంగా మారాడు. ఉదయ్ కిరణ్‏ను అభిమానించేవారి సంఖ్య ఎక్కువగానే ఉండేది. చిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్.. నువ్వు నేను సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మనసంతా నువ్వే మూవీ కూడా సూపర్ హిట్. దీంతో ఉదయ్ కిరణ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. స్టార్ హీరోలను తన సైతం వెనక్కు నెట్టేశాడు. కెరీర్ ఫుల్ ఫాంలో ఉన్న సమయంలో తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనలతో తన కెరీర్ ఒక్కసారిగా తలకిందులు అయిపోయింది.

స్టార్ హీరోలు సైతం క్రియేట్ చేయని రికార్డ్స్ సృష్టించిన ఉదయ్..ఆ తర్వాత అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. సినిమాలు తగ్గిపోయాయి. వచ్చిన ఒకట్రెండు చిత్రాలు కూడా హిట్ కాలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు.. సినీ పరిశ్రమలో అవమానాలను ఎదుర్కోన్నాడని ఉదయ్ కిరణ్ సన్నిహితులు చెబుతుంటారు. ఆ తర్వాత కొంతకాలానికి విషితా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు.. ఆ తర్వాత ఉదయ్ కిరణ్‏ను మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి. ఆర్థిక ఇబ్బందులు… భార్యతో గొడవలతో ఉదయ్ కిరణ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలోనే జనవరి 5… 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ మరణంతో సినీ పరిశ్రమలో పెద్ద చర్చే జరిగింది. ఆందోళనలు.. విమర్శలు కూడా జరిగాయి.

ఉదయ్ కిరణ్ చనిపోయి ఏడేళ్లు గడిచిన తర్వాత అతను రాసిన లేఖ ఒకటి బయటకు వచ్చింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో.. ” విషితా మా అమ్మ అంటే ఎంత ఇష్టమో.. ఆ తర్వాత అంతగా నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు. అయితే మన మధ్య గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధ పడుతున్నారు. వారికి ఈ బాధ ఉండకూడదు. నువ్వు అతడు మంచివాడు అని అనుకుంటున్నావు.. కానీ అతను అస్సలు మంచివాడు కాదు. నా మాట విను. నువ్వు నిజం తెలుసుకునే రోజు వస్తుంది. కానీ అప్పుడు ఉదయ్ ఉండడు. నువ్వు ఒకసారి అమెరికా వెళ్లి వైద్యం చేయించుకో. నాకు సినీ ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదురయ్యాయి. నన్ను ఓ మ్యాడ్‏గా చిత్రీకరించి ఆడుకుంది. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధ పడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది. అమ్మా నిన్ను ఓసారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా..” అంటూ ఉదయ్ రాసినట్టుగా ఉంది.

ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చదివిన నెటిజన్స్ ఉదయ్ కిరణ్‏ను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Also Read: Sampoornesh Babu: తూర్పు గోదావరి జిల్లాలో సంపూర్ణేష్‌ సందడి.. స్వచ్ఛంద సంస్థకు విరాళం అందజేత..

Brahmanandam: మీమ్స్ క్రియేట్ చేస్తున్నవాళ్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్న బ్రహ్మానందం..

Click on your DTH Provider to Add TV9 Telugu