AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virata Parvam: ‘మణికర్ణిక’ దారిలో ‘విరాటపర్వం’.. రానా సినిమాకు ఇద్దరు డైరెక్టర్స్ ? కారణమేంటంటే..

దగ్గుబాటి రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ హీరో నుంచి రెండు సినిమాలు విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.

Virata Parvam: 'మణికర్ణిక' దారిలో 'విరాటపర్వం'.. రానా సినిమాకు ఇద్దరు డైరెక్టర్స్ ? కారణమేంటంటే..
Virataparvam
Rajitha Chanti
|

Updated on: Jul 02, 2021 | 8:58 PM

Share

దగ్గుబాటి రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ హీరో నుంచి రెండు సినిమాలు విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో మూవీ రిలీజ్ డేట్స్ పై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అందులో “విరాట పర్వం” సినిమా కూడా ఒకటి. ఇందులో రానాకు జోడిగా సాయి పల్లవి నటిస్తుండగా.. ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరి రావు, జరీనా వహాబ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించారు. డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో.. సురేష్ బాబు సమర్పకులుగా సుధాకర్ చెరుకూరి ఎస్.ఎల్.వి సినిమాస్- సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపైఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ గురించి ఫిల్మ్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు పనిచేసినట్లుగా టాక్ నడుస్తోంది.

కొన్ని కారణాలతో వేణు ఉడుగుల చిత్రయూనిట్ కు అందుబాటులో లేరట. దీంతో వేరోక దర్శకుడితో విరాట పర్వం సన్నివేశాలను తెరకెక్కించినట్లుగా టాక్. అయితే ఒక దర్శకుడు పనిచేస్తుండగానే.. మరో దర్శకుడితో సినిమా తీయించడమేనేది కాస్తా విచిత్రంగానే ఉంది. కానీ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని మరో యంగ్ డైరెక్టర్ సహయం తీసుకున్నారట మేకర్స్. ఇందుకు దర్శకుడు వేణు ఉడుగుల అనుమతి కూడా తీసుకున్నారట. అయితే ఆ యువ దర్శకుడు ఎవరు ? ఆయన పేరును మాత్రం బయటకు రాకుండా చూసుకున్నారు మేకర్స్. అయితే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. దర్శకుడు క్రిష్, కంగనకు మధ్య తీవ్ర వివాదాలు తలెత్తాయి. క్రియేటివ్ డిఫరెన్సె్స్ రావడంతో.. క్రిష్ పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేయకుండానే ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. 80 శాతం క్రిష్ తెరకెక్కించగా మిగతా 20 శాతం షూట్ చేసిన కంగన అంతా తానే దర్శకత్వం వహించానని చెప్పుకోవడం అప్పట్లో బీటౌన్ హాట్ టాపిక్ గా మారింది.

నక్సలిజం బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులోని పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రానా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో నటిస్తుండగా.. మరికొన్ని భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Also Read: Shilpa Shetty: భయంకరంగా మారిన శిల్పాశెట్టి.. సాగర కన్య ఇలా భయపెట్టడమేంటని ప్రశ్నిస్తున్న నెటిజన్లు…

Yash: బెంగుళూరులో ఖరీదైన ఇల్లు కొన్న యష్.. భార్యతో కలిసి నూతన గృహప్రవేశం చేసిన రాకీబాయ్.. ధర ఎంతంటే..