- Telugu News Photo Gallery Cinema photos Kannada actor yash new house ceremony photos goes viral in social media
Yash: బెంగుళూరులో ఖరీదైన ఇల్లు కొన్న యష్.. భార్యతో కలిసి నూతన గృహప్రవేశం చేసిన రాకీబాయ్.. ధర ఎంతంటే..
చాలా మందికి సొంతంగా ఇళ్లు కట్టుకోవాలని అనుకుంటుంటారు. అందులోనూ తమకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవాలని ఆశపడుతుంటారు. అయితే కొందరికి మాత్రమే ఆ కల నెరువేరుతుంది. తాజాగా రాక్ స్టార్ యష్ సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు.
Updated on: Jul 02, 2021 | 8:14 PM

కన్నడ స్టార్ హీరో యష్ ఓ ఇంటివాడయ్యాడు. బెంగుళూరులోని అత్యంత ఖరీదైన ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్స్‌లో యష్ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అందులో తమకు నచ్చిన విధంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకోని తన భార్యతో కలిసి గృహ ప్రవేశం చేశారు..

ఆ ఇంట్లో ఖరీదైన వైట్ మార్పుల్, వుడ్ ఫర్నిష్ తోపాటు అత్యాధునిక సదుపాయాలతో ఆ హోం సెలెక్ట్ చేసుకున్నారు. ఇందుకోసం యష్ దాదాపు రూ. 4 కోట్ల వరకు ఖర్చు చేశాడట.

గురువారం తన భార్యతో కలిసి యష్ నూతన గృహప్రవేశం చేశాడు. ఈ వేడుకకు యష్ తల్లిదండ్రులతోపాటు.. కొంతమంది కుటుంబసభ్యులు, ఆత్మీయులు మాత్రమే హాజరయ్యారు.

యష్ కొత్త ఇంటి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన యష్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకు అభినందనలు తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం యష్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్-2 సినిమా చేస్తున్నాడు. ఇది కేజీఎఫ్ సినిమాకు సిక్వెల్ గా నిర్మిస్తుండగా... ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇందులో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. అలాగే ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింక్ చివరిదశలో ఉండగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.





























