Tumbbad Trailer: ఊహించలేని ట్విస్టులు.. ఒళ్లు గగుర్పొడిచే సీన్స్.. వణుపుట్టిస్తోన్న ‘తుంబాడ్’ ట్రైలర్ చూశారా..?

2018లో అక్టోబర్ 12న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. సోహమ్ షా, హరీష్ ఖన్నా, జ్యోతి మల్షే, రుద్ర సోని, మాధవ్ హరి జోషి ప్రధాన పాత్రలు పోషఇంచిన ఈ సినిమా రూ.13.6 కోట్లు రాబట్టింది. అంతేకాదు 64వ ఫిల్మ్ పేర్ అవార్డ్స్ వేడుకలో ఏకంగా 3 అవార్డ్స్ గెలుచుకుంది.

Tumbbad Trailer: ఊహించలేని ట్విస్టులు.. ఒళ్లు గగుర్పొడిచే సీన్స్.. వణుపుట్టిస్తోన్న 'తుంబాడ్' ట్రైలర్ చూశారా..?
Tumbbad Trailer
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 05, 2024 | 7:54 PM

కొన్నాళ్లుగా హారర్ చిత్రాలను చూసేందుకు సినీ లవర్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఆద్యంతం ట్విస్టులతో కూడిన సినిమాలకు అడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవలే హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన స్త్రీ 2 చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కానీ గతంలోనే ఓ హారర్ మూవీ ప్రేక్షకులకు వణుకుపుట్టించింది తెలుసా. ఇప్పటికీ ఆ సినిమా పేరు చెబితే ఒళ్లు జలదరించాల్సిందే. అంతగా అడియన్స్ మనసులలో నిలిచిపోయింది. అదే తుంబాడ్. 2018లో అక్టోబర్ 12న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. సోహమ్ షా, హరీష్ ఖన్నా, జ్యోతి మల్షే, రుద్ర సోని, మాధవ్ హరి జోషి ప్రధాన పాత్రలు పోషఇంచిన ఈ సినిమా రూ.13.6 కోట్లు రాబట్టింది. అంతేకాదు 64వ ఫిల్మ్ పేర్ అవార్డ్స్ వేడుకలో ఏకంగా 3 అవార్డ్స్ గెలుచుకుంది.

ఈ చిత్రాన్ని రూపొందించడానికి మేకర్స్ ఏకంగా ఆరేళ్లు కష్టపడ్డారట. 2012లో షూటింగ్ స్టార్ట్ కాగా.. 2018లో ఈ సినిమా విడుదలైంది. తెలుగుతోపాటు కన్నడ, హిందీ భాషలలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా.. మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. ఓవైపు ఓటీటీలో రికార్డ్స్ సృష్టిస్తోన్న ఈసినిమాను ఇప్పుడు మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. తుంబాడ్ చిత్రాన్ని ఈనెల 13న రీరిలీజ్ చేయనున్నారు. రాహి అనిల్ బార్వే, ఆనంద్ గాంధీ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇప్పుడు 4K వెర్షన్ లో రీరిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తుంబాడ్ కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఊహించలేని ట్విస్టులతో.. ఒళ్ల గగుర్పొడిచే సీన్లతో ప్రేక్షకులను భయపెట్టడం ఖాయమన్నట్లుగా కనిపిస్తుంది.

కథ విషయానికి వస్తే.. 1918లో మహారాష్ట్రలోని కలమేడ్ గ్రామంలో ప్రారంభమవుతుంది. వినాయక్ రావు (సోహం షా) తన తల్లి, సోదరుడితో కలిసి ఈ గ్రామంలో ఉంటాడు. ఊరి గుడిలో నిధి దాగి ఉందని తెలిసి.. దానిని వెతికేందుకు వెళ్తాడు. ఇక అక్కడే అసలు కథ మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి

తుంబాడ్ ట్రైలర్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.