Jr.NTR: బన్నీ సినిమాకు బ్రేక్.. ఎన్టీఆర్‌తో చేయనున్న త్రివిక్రమ్.. నిర్మాత ట్వీట్‌కు అర్థం అదేనా.. ?
టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కొన్నాళ్లుగా ఏ సినిమా చేయలేదు. చివరగా గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న ఈ దర్శకుడు..ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా భారీ మైథలాజికల్ సినిమాను తెరకెక్కించనున్నారని టాక్ నడిచింది. త్వరలోనే అనౌన్స్మెంట్ వస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు.

డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాలకు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. గురూజీ మూవీస్ కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కొన్నేళ్లుగా వరుసగా హిట్ చిత్రాల్లను తెరకెక్కించిన త్రివిక్రమ్.. ఇప్పుడు కాస్త స్లో అయ్యారు. చివరగా గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న గురూజీ.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు. అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ మైథలాజికల్ స్టోరీని రూపొందించేందుకు గురూజీ సిద్ధమవుతున్నాడని టాక్. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన సైతం చేయనున్నారనే ప్రచారం నడించింది. కానీ ఈలోపే బన్నీ లైనప్ మారిపోయింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
ఇదివరకే వీరిద్దరి ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రాగా.. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ 12 నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అట్లీ ప్రాజెక్ట్ కారణంగా ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్టుకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. నిజానికి వీరిద్దరి కాంబోలో వచ్చే మైథాలాజికల్ సినిమాలో బన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాత్రలో కనిపించనున్నారని హిట్స్ కూడా ఇచ్చేశారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఇదే చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అందుకు కారణం నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్.
ఈరోజు నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ లో ఏముందంటే.. కార్తీకేయ స్వామికి సంబంధించిన రెండు శ్లోకాలు పంచుకున్నారు. నా ఫేవరేట్ అన్న మోస్ట్ పవర్ ఫుల్ గాడ్ గా కనిపించనున్నాడు అని ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరలవుతుంది. నాగవంశీ ఫేవరేట్ హీరో ఎన్టీఆర్ అన్న సంగతి తెలిసిందే. ఈ విషయం నాగవంశీ సైతం అనేకసార్లు చెప్పారు. ఇక ఇప్పుడు కార్తీకేయ స్వామి శ్లోకాలు షేర్ చేయడంతో త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమాను ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయనున్నారని ప్రచారం నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
నాగవంశీ ట్వీట్..
My most favourite anna as one of the most powerful gods. pic.twitter.com/Vq4dFV3lJd
— Naga Vamsi (@vamsi84) June 11, 2025
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..