Tollywood: సినిమా కోసం 6-7 గంటలు చెత్త కుప్పలలో గడిపిన ఏకైక హీరోయిన్.. గుర్తుండిపోయే అనుభవం అంట..
ఇప్పుడు పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆమె. తెలుగు, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రంలో నటిస్తోన్న ఓ హీరోయిన్.. తన పాత్ర కోసం రిస్క్ చేసింది. దాదాపు 6-7 గంటలపాటు చెత్తకుప్పల మధ్య గడిపిందట. జీవితంలో గుర్తుండిపోయే అనుభవం ఉంటూ ఇటీవల ఆ సినిమా ప్రమోషన్లలో వెల్లడించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. తెలుగు, హిందీ భాషలలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తుంది ఈ వయ్యారి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఇంకెవరూ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. పుష్ప 2, యానిమల్, ఛావా వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు కుబేర సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది.
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ్ హీరో ధనుష్, నాగార్జున కలిసి నటిస్తున్న సినిమా కుబేర. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇందులో బాలీవుడ్ స్టార్స్ జిమ్ సర్భ్, దలీప్ తహిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక మందన్నా నటించింది. విభిన్న కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఈనెల 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా కుబేర మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. అయితే తాజాగా ఈమూవీ పీ పీ డుమ్ డుమ్ పాట విడుదల వేడుకను ముంబైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో ధనుష్ రష్మిక గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
“ఈ సినిమాలో నేను బెగ్గర్ పాత్రలో నటించానని.. అందుకోసం ఎంతో రీసెర్చ్, హోమ్ వర్క్ చేశానని చెప్పను.. శేఖర్ కమ్ముల సర్ చెప్పింది చేసుకుంటూ వెల్లాను. దాదాపు 20 నిమిషాల్లో ఈ సినిమా స్క్రిప్ట్ వినిపించారు. ఓ డంప్ యార్డ్ లో దాదాపు 7 గంటలపాటు నేను, రష్మిక షూటింగ్ లో పాల్గొన్నాం. అక్కడ అంతసేపు ఉన్నా ఆమె బాగానే ఉంది.. నాకేం వాసన రావట్లేదు అని చెప్పింది. మరి ఆమెకు ఏమైందో నాకు తెలియదు .. ఇలా ఎన్నో మంచి జ్ఞాపకాలు అందించింది ఈ చిత్రం ” అంటూ చెప్పుకొచ్చారు.
రష్మిక మాట్లాడుతూ.. ‘ఒక నటిగా నాకు అత్యంత గుర్తిండిపోయే అనుభవం ఇది. ఈ సినిమాలో చెత్త కుప్పల మధ్య 6 గంటలు షూటింగ్ చేయడం కొత్త అనుభంవం. శేఖర్ సర్ నిజమైన ప్రదేశాలలో షూట్ చేయడానికి ఇష్టపడతారు. కెమెరాతో పరిగెడుతూ షాట్స్ తీసేందుకు ప్రయత్నిస్తారు. ఒక్క దర్శకుడిది ఒక్కో విజన్. దర్శకులు చెప్పినట్లుగానే నేను నటిస్తాను. నాగార్జున, ధనుష్ వంటి హీరోలతో నటించడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..