AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యారెక్టర్ ఆఫర్ చేస్తే చేయను అన్నారు.. ఆయనలా బతకడం ఎవరివల్లా కాదు : త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాములుగా త్రివిక్రమ్ సినిమా అంటే చాలు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. సినిమాలో కథతో పాటు ఆయన డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

క్యారెక్టర్ ఆఫర్ చేస్తే చేయను అన్నారు.. ఆయనలా బతకడం ఎవరివల్లా కాదు : త్రివిక్రమ్
Trivikram
Rajeev Rayala
|

Updated on: Aug 13, 2025 | 11:58 AM

Share

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలు ఉండే ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన సినిమాలోని కథ, పాత్రలు ముఖ్యంగా డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు త్రివిక్రమ్. త్రివిక్రమ్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడతాయి. దర్శకుడిగా బిజీగా ఉన్న త్రివిక్రమ్ ఎన్నోసినిమా ఈవెంట్స్ కు కూడా హాజరవుతూ ఉంటారు.. తాజాగా ఓ సినిమా ఈవెంట్ కు వెళ్లైన త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.. ఓ నటుడి గురించి ఆయన మాట్లాడుతూ.. నేను నా సినిమాలో ఆయనను తీసుకోవాలని అనుకున్నా.. కానీ ఎవరో ఆయన ఒప్పుకోడు అని చెప్పారని తెలిపాడు. ఇంతకూ త్రివిక్రమ్ చెప్పింది ఎవరి గురించి.? అంత పెద్ద స్టార్ దర్శకుడి సినిమాలో నటించను అని ఆయన ఎందుకు చెప్పారో చూద్దాం.!

ఇదికూడా చదవండి : ఏం పార్థు నన్నే మర్చిపోయావా..? నేను నీ పద్దుని.. ఎంత మారిపోయింది ఈ చిన్నది..

త్రివిక్రమ్ మాటలకు, ఆయన స్పీచ్ కు ఫ్యాన్స్ ఉంటారు.. తాజాగా త్రివిక్రమ్ ఆర్. నారాయణ మూర్తి నటించిన యూనివర్సిటీ అనే సినిమా చూశారు. ఆ సినిమా గురించి.. నారాయణమూర్తి గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “నారాయణమూర్తి గారు వన్ మ్యాన్ ఆర్మ్.. ఆయన సినిమాలో రాజు ఆయనే, సైనికుడు, మంత్రి అన్నీ ఆయనే..  నొక్కబడే గొంతులు గురించి మాట్లాడటానికి ఒక గొంతు ఉంది.. అది అందరికి వినిపించాలి ఆలాంటి గొంతు ఆర్ నారాయణమూర్తి”.

ఇదికూడా చదవండి :143 Movie : ఎన్నాళ్లకు కనిపించింది..!! 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..

“ఈ సినిమా చూడటానికి వచ్చినప్పుడు అయ్యబాబోయ్ 2 గంటలు సినిమా చూడాలా.? అనిపించింది. కానీ సినిమా చాల ఫాస్ట్ గా జరిగిపోయింది. అందులో కథను అద్భుతంగా చూపించారు. ఆర్ నారాయణ మూర్తిని ఎందుకు గౌరవిస్తారంటే.. మీ అభిప్రాయం గురించి చెప్పే తీరు.. దాన్ని ఎవ్వరూ.. ప్రశ్నించలేరు. ఆ నిబ్బద్దత నచ్చే నేను ఇక్కడికి వచ్చాను. ఇంతలా రాజీ పడకుండా బ్రతకడం అందరి వల్ల సాధ్యం కాదు. నా వల్ల కూడా కాదు. నేను చాలా సార్లు రాజీ పడ్డాను. ఆర్ నారాయణ మూర్తిగారు మరిన్ని సినిమాలు తీయాలి. ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. నా సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని అనుకున్నాం.. కానీ నాకు ఎవరో ఆయన చేయరు అని చెప్పారు. రెమ్యునరేషన్ ఆఫర్ చేసి ఆర్ నారాయణమూర్తిగార్ని కొనలేరు అని చెప్పారు. ఇలాంటి సినిమాలు. ఇలాంటి విషయాలు జనాలు మీరు చెప్తేనే ఎందుకు వింటారంటే.. మీరు ఇలాంటివి డబ్బు కోసమో, సక్సెస్ కోసమో చెప్పారు నిజంగా జనాల కోసం చెప్తారు. ఈ సినిమా ఆడాలి.. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఆగస్టు 22న ఈ సినిమా విడుదల అవుతుంది”.. అంటూ చెప్పుకొచ్చారు త్రివిక్రమ్.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి : 53 సినిమాలు చేసింది.. హీరోయిన్‌గానే కాదు స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపింది.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

Trivikram, R Narayana Murth

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి