AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha : ఆ స్టార్ హీరోపై త్రిష స్పెషల్ పోస్ట్.. మరోసారి తెరపైకి డేటింగ్ రూమర్స్.. ఇంతకీ ఎవరతను..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కుర్ర హీరోయిన్లకే గుబులు పుట్టిస్తోన్న అందం త్రిష. 41 ఏళ్ల వయసులోనూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ ఏడాది విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంది. తాజాగా త్రిష షేర్ చేసిన ఒక్క పోస్ట్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ చర్చ నడుస్తోంది.

Trisha : ఆ స్టార్ హీరోపై త్రిష స్పెషల్ పోస్ట్.. మరోసారి తెరపైకి డేటింగ్ రూమర్స్.. ఇంతకీ ఎవరతను..
Trisha
Rajitha Chanti
|

Updated on: Jun 23, 2025 | 1:09 PM

Share

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నటీమణులలో త్రిష కృష్ణన్ ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. ఈ ఏడాది వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. ఇటీవలే థగ్ లైఫ్ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కమల్ హాసన్, శింబు కలిసి నటించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 5న విడుదలై విజయాన్ని అందుకుంది. అయితే సినిమాలతోపాటు త్రిష ఎక్కువగా వివాదాలతోనూ వార్తలలో నిలుస్తుంటుంది. ముఖ్యంగా ఓ స్టార్ హీరోతో ఆమె ప్రేమలో ఉందని.. కొన్నాళ్లుగా వీరిద్దరు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారంటూ ప్రచారం నడుస్తుంది. తాజాగా ఆ స్టార్ తో కలిసి ఉన్న ఫోటోను ఆమె షేర్ చేయడంతో డేటింగ్ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి.

ఇంతకీ త్రిష షేర్ చేసిన పోస్ట్ ఏంటో తెలుసా.. ? కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి పుట్టినరోజు జూన్ 22. ఈ సందర్భంగా హ్యాపీ బర్త్ డే బెస్టెస్ట్ అంటూ ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ ఓ ఫోటో షేర్ చేసింది. అందులో విజయ్ తన పెట్ డాగ్ తో ఆడుతుండగా.. తాను పక్కనే కూర్చుని కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు త్రిష చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అలాగే అభిమానులకు మరోసారి సందేహాలు మొదలయ్యాయి. ఆ ఫోటో చూస్తే విజయ్ త్రిష ఇంట్లో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఇది ఇప్పటి ఫోటోనా.. ? లేదా పాత ఫోటోనా అనేది క్లారిటీ లేదు.

కొన్నాళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ నడుస్తున్నాయి. అయితే వీటిపై ఇప్పటివరకు వీరు ఇద్దరు స్పందించలేదు. విజయ్, త్రిష కలిసి గతంలో గిల్లి చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఇటీవలే ఇద్దరు కలిసి లియో చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ జన నాయగన్ చిత్రంలో నటిస్తున్నారు విజయ్. అలాగే త్రిష మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..