Actress Pushpalatha: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి పుష్పలత కన్నుమూత..
టాలీవుడ్ సీనియర్ నటి పుష్పలత (87) చైన్నైలో కన్నుమూశారు. టీ.నగర్ లోని తిరుమల పిళ్లై రోడ్డులో నివాసం ఉంటున్న ఆమె వృద్ధాప్యం కారణంగా మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించారు పుష్పలత.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఏవీఎం రాజన్ సతీమణి.. ఒకప్పటి నటి పుష్పలత కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 87 సంవత్సరాలు. చెన్నైలోని టీ.నగర్, తిరుమల పిళ్లై రోడ్డులోని నివాసంలో ఉంటున్న ఆమె వృద్ధాప్యం కారణంగా శ్వాసపీల్చడంలో సమస్యలు తలెత్తడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. 1958లో విడుదలైన సెంగోట్టై సింగం అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు పుష్పలత. ఆ తర్వాత 1961లో కొంగునాట్టు తంగం అనే సినిమాలో కథానాయికగా కనిపించారు. నానుమ్ ఒరు పెణ్ అనే సినిమాలో నటుడు ఏవీఎం రాజన్ కు జోడిగా నటించారు. అదే సమయంలో వీరిద్దరు స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ఆయననే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పుష్పలత. వీరికి ఇద్దరు సంతానం.
తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు పుష్పలత. పెద్దకొడుకు, మేము మనుషులమే, అన్నదమ్ముల అనుబంధం, యుగపురుషుడు, రాజపుత్ర రహస్యం, శ్రీరామ పట్టాభిషేకం, కొండవీటి సింహం వంటి చిత్రాల్లో నటించారు. ఏవీఎం సంస్థ నిర్మించిన రాము సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించారు పుష్పలత. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషలలోనూ నటించారు పుష్పలత.
1963లో మైన్ భీ లక్కీ హూన్ అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నర్స్ అనే మలయాళ సినిమాలోనూ నటించారు. సకలకళా వల్లభన్, నాన్ అడిమై ఇల్లై వంటి చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. పుష్పలత చివరిసారిగా 1999లో విడుదలైన పూవాసమ్ అనే చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత వయసు ప్రభావం దృష్ట్యా ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయారు. పుష్పలత మృతిపై సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. పుష్పలత కుమార్తె మహాలక్ష్మీ రెండు జెళ్ల సీత, ఆనంద భైరవి, మాయదారి మరిది వంటి చిత్రాల్లో కథానాయికగా నటించారు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన