AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Senior Actor Eswar Rao: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినీవినీలాకాశంలో ఎందరో నటులతో కలిసి పనిచేసిన సీనియర్‌ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. అమెరికాలోని మిచిగాన్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్యం అక్టోబర్‌ 31వ తేదీన మరణించారు. ఆయన మరణ వార్త ఆలస్యం వెలుగులోకి రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో దుఃఖసంద్రంలో మునిగిపోయింది. స్వర్గీయ దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం చిత్రం ద్వారా నటుడు ఈశ్వరరావు సినీరంగ ప్రవేశం చేశాడు. ఇదే సినిమాతోనే నటుడు మోహన్ బాబు కూడా పరిశ్రమలోకి అరంగెట్రం చేశారు. అప్పట్లో ఈ మూవీ సూపర్‌హిట్‌..

Senior Actor Eswar Rao: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత
Senior Actor Eswar Rao
Srilakshmi C
|

Updated on: Nov 03, 2023 | 1:37 PM

Share

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినీవినీలాకాశంలో ఎందరో నటులతో కలిసి పనిచేసిన సీనియర్‌ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. అమెరికాలోని మిచిగాన్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్యం అక్టోబర్‌ 31వ తేదీన మరణించారు. ఆయన మరణ వార్త ఆలస్యం వెలుగులోకి రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో దుఃఖసంద్రంలో మునిగిపోయింది.

స్వర్గీయ దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం చిత్రం ద్వారా నటుడు ఈశ్వరరావు సినీరంగ ప్రవేశం చేశాడు. ఇదే సినిమాతోనే నటుడు మోహన్ బాబు కూడా పరిశ్రమలోకి అరంగెట్రం చేశారు. అప్పట్లో ఈ మూవీ సూపర్‌హిట్‌ అయ్యింది. ఈ సినిమాకు గానూ ఆయన కాంస్య నంది అవార్డును కూడా అందుకున్నారు. దీంతో ఆయన మరి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలా తన కెరీర్‌లో దాదాపు 250కు పైగా చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నరు. నటుడు ఈశ్వరరావు మృతితో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుసుతున్నారు.

సీనియర్‌ నటుడు ఈశ్వరరావు తొలిసినిమా స్వర్గం నరకం హిట్‌ అందుకున్న ఆ తర్వాత దేవతలారా దీవించండి, కన్నవారిల్లు, ఖైదీ నెం 77, ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, శభాష్ గోపి, ఆడదంటే అలుసా, తల్లిదీవెన, ఘరానా మొగుడు, బంగారు బాట, సంగీత, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి, జయం మనదే వంటి విజయవంతమైన సినిమాల్లో ఈశ్వరరావు నటించారు. అన్నయ్య, కొడుకు, స్నేహితుడు, విలన్ వంటి సపోర్టింగ్ క్యారెక్టర్లను చేశారు. నటుడు ఈశ్వరరావు చివరిసారిగా చిరంజీవి, నగ్మా జంటగా నటించిన ‘ఘరానా మొగుడు’ మువీలో కనిపించారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే గత కొంతకాలంగా సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి మరణ వార్త మరువక ముందే.. టాలీవుడ్, కోలీవుడ్ విలక్షణ నటుడు నాజర్ తండ్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా మాలీవుడ్‌ (మలయాళ) టీవీ, సినీ నటి రెంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. మరో టీవీ నటి డాక్టర్ ప్రియ గుండె పోటుతో రెండు రోజుల క్రితం కన్నుమూశారు. గర్భిణి అయిన ఆమె జనరల్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లి గుండెపోటుకు గురైంది. వెంటనే వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను బతికించగలిగారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.