OP. Hawkeye: సిరియాపై అమెరికా మెరుపు దాడి.. 30కి పైగా ISIS స్థావరాల నేలమట్టం.!
సిరియాలోని ISIS స్థావరాలపై అమెరికా దాడికి పాల్పడింది. ఆపరేషన్ హాకీ స్ట్రైక్‌లో భాగంగా అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) దళాలు, మిత్రరాజ్యాల దళాలతో కలిసి సిరియా అంతటా అనేక ISIS లక్ష్యాలపై పెద్ద ఎత్తున దాడి చేశాయి. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ దాడులు జరిగాయని CENTCOM సోషల్ మీడియా Xలో ఒక పోస్ట్‌లో పేర్కొంది.

సిరియాలోని ISIS స్థావరాలపై అమెరికా దాడికి పాల్పడింది. ఆపరేషన్ హాకీ స్ట్రైక్‌లో భాగంగా అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) దళాలు, మిత్రరాజ్యాల దళాలతో కలిసి సిరియా అంతటా అనేక ISIS లక్ష్యాలపై పెద్ద ఎత్తున దాడి చేశాయి. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ దాడులు జరిగాయని CENTCOM సోషల్ మీడియా Xలో ఒక పోస్ట్‌లో పేర్కొంది.
సిరియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఆపరేషన్ హాకీ స్ట్రైక్ చేపట్టింది. ఇందలో భాగంగా అమెరికా సెంట్రల్ కమాండ్ సిరియాలోని పలు ఇస్లామిక్ స్టేట్ (ISIS) స్థావరాలపై భారీ వైమానిక దాడులను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అమెరికా నిరంతర నిబద్ధతలో ఉందని అమెరికా పేర్కొంది. ఈ చర్య ఉద్దేశ్యం US దళాలు, మిత్రరాజ్యాల దళాలపై ఉగ్రవాద దాడులను నిరోధించడం, భవిష్యత్తులో వచ్చే ముప్పులను తొలగించడం, ఈ ప్రాంతంలో భద్రత కోసం దాడులకు పాల్పడినట్లు CENTCOM పేర్కొంది. “మా దళాలకు హాని కలిగించడానికి ప్రయత్నించే ఎవరైనా, వారు ఎక్కడ ఉన్నా, కనుగొని నిర్మూలిస్తాం.” అని సోషల్ మీడియా ద్వారా హెచ్చరించింది.
— U.S. Central Command (@CENTCOM) January 10, 2026
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు డిసెంబర్ 19, 2025న ఆపరేషన్ హాకీ స్ట్రైక్ ప్రారంభించి. డిసెంబర్ 13, 2025న సిరియాలోని పాల్మిరాలో జరిగిన ISIS దాడిలో ఇద్దరు US సైనికులు, ఒక అమెరికన్ పౌరుడు మరణించారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి. మరణించిన సైనికులను ఐయోవా నేషనల్ గార్డ్‌కు చెందిన సార్జెంట్ ఎడ్గార్ బ్రియాన్ టోర్రెస్ టోవర్ (25), సార్జెంట్ విలియం నాథనియల్ హోవార్డ్ (29)గా గుర్తించారు. ఈ ఇద్దరు సైనికులు ఈ సంవత్సరం ప్రారంభంలో మధ్యప్రాచ్యానికి మోహరించిన US సైనిక దళంలో విధులు నిర్వహిస్తున్నారు.
CNN కథనం ప్రకారం, ఈ సైనిక ఆపరేషన్ సమయంలో 90 కి పైగా ప్రెసిషన్ మందుగుండు సామగ్రిని ఉపయోగించారు. 35 కి పైగా ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. రెండు డజనుకు పైగా యుద్ధ విమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. ISIS ను పూర్తిగా ఓడించడానికి ఆపరేషన్ ఇన్హెరెంట్ రిసాల్వ్ వ్యూహంలో ఈ ఆపరేషన్ భాగమని US అధికారులు చెబుతున్నారు. ఈ చర్య సిరియాలో పనిచేస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌కు పెద్ద దెబ్బ తగిలిందని, రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యకలాపాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
