- Telugu News Photo Gallery Cinema photos Vijay thalapathy lokesh kanagaraj Movie LEO collections and next movie Update Telugu Entertainement Photos
Vijay – LEO: విజయ్ లియో గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ రివీల్ చేసిన లోకేష్ కనగరాజ్.
విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లియో. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన వసూళ్ల పరంగా సత్తా చాటింది. విజయ్ కెరీర్ లో మాత్రమే కాదు కోలీవుడ్ హిస్టరీ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది లియో. అయితే ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాను విజయ్ కోసం రెడీ చేయలేదట. రీసెంట్ ఇంటర్వ్యూ లో లియో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు లోకేష్ కనగరాజ్.
Updated on: Nov 03, 2023 | 2:57 PM

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లియో. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన వసూళ్ల పరంగా సత్తా చాటింది. విజయ్ కెరీర్ లో మాత్రమే కాదు కోలీవుడ్ హిస్టరీ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది లియో. అయితే ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాను విజయ్ కోసం రెడీ చేయలేదట.

రీసెంట్ ఇంటర్వ్యూ లో లియో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు లోకేష్ కనగరాజ్. ఎల్‌సీయూ లో భాగంగా ఇప్పటికే చాలా కథలను రెడీ చేసి పెట్టుకున్న లోకేష్, మార్కెట్ కు తగ్గట్టుగా ఆ కథ స్కేల్ ను పెంచుకుంటూ పోతున్నారు.మా నగరం సినిమాను మినిమమ్ బడ్జెట్ లోనే పూర్తి చేసిన ఈ యంగ్ డైరెక్టర్, ఆ తరువాత ఖైదీ సినిమాను కూడా అతి తక్కువ బడ్జెట్ లోనే పూర్తి చేశారు.

ఖైదీ సూపర్ హిట్ కావటంతో మాస్టర్ సినిమాకు కాస్త భారీగానే ఖర్చు పెట్టారు. విక్రమ్, లియో సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందించిన లోకేష్, కథగా అన్ని సినిమాలను ఒకే స్థాయిలో డిజైన్ చేసిన పెట్టుకున్నానని చెప్పారు. అసలు లియో కథను ఐదేళ్ల క్రితం మరో హీరో కోసం సిద్ధం చేశానని చెప్పారు.

కానీ అప్పట్లో ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాకపోవటంతో డిలే అయ్యింది. విజయ్ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యాక, ఆయన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి లియో సినిమాను రూపొందించినట్టుగా వెల్లడించారు.

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లియో తమిళనాట 460 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికే చెన్నైలో మంచి వసూళ్లు సాధిస్తుండటం తో ఫుల్ రన్ లో ఈ సినిమా 500 కోట్ల మార్క్ ను క్రాస్ చేయటం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది.

లియో రిలీజ్ తరువాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా నెక్ట్స్ మూవీతో బిజీ అయ్యారు విజయ్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు.లోకేష్ కూడా లియో ప్రమోషన్స్ లో పాల్గొంటూనే నెక్ట్స్ మూవీ పనులు కానిచ్చేస్తున్నారు.

ఆల్రెడీ రజనీకాంత్ హీరోగా ఓ సినిమాను ఎనౌన్స్ చేసిన లోకేష్ త్వరలోనే ఆ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. లియో విషయంలో వినిపించిన విమర్శలకు రజనీ మూవీతో లోకేష్ చెక్ పెడతారేమో చూడాలి.




