Watch Video: అర్థరాత్రి రోడ్డుపై భర్త హంగామా.. భార్య ఎంట్రీతో మారిన సీన్.. అసలు మ్యాటరేంటంటే?
కడప జిల్లాలో ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమారుడితో అర్థరాత్రి రోడ్డుపై హంగామా సృష్టించాడు. పోలీస్ స్టేషన్ ముందు ఉన్న రోడ్డుపై బైఠాయించి వచ్చిపోయే వాహనాలకు ఆటంకం కలిగించారు. కేసు వివరాలు అడిగితే పోలీసులు లంచం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. సీన్ కట్‌చేస్తే అక్కడి చేరుకున్న అతని భార్య భర్త గురించి షాకంగ్ విషయాలు బయటపెట్టింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

కడప జిల్లాలో షాకంగ్ ఘటన వెలుగు చూసింది. రెండేళ్ల కుమారుడతో అర్థరాత్రి రోడ్డుపై పడుకొని ఓ వ్యక్తి హంగా సృష్టించాడు. తన భార్య కనిపించడం లేదని పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే.. పోలీసలుఉ తనకు కంప్లైంట్ కాపీ ఇవ్వలేదని సదురు వ్యక్తి ఆరోపించారు. అందుకు నిరసనగా పీఎస్ ముందు రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నాడు. సీఐ తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా లంచం డిమాండ్ చేసాడని పోలీసులతో వాగ్వివాదనికి దిగాడు.
వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా మొలకల చెరువుకు చెందిన అఖిల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలసి స్టేషన్ ఎదుట హల్చల్ చేశాడు. రెండేళ్ల కుమారుడిని తీసుకుని పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై వెళ్తున్న బసుకు అడ్డంగా పడుకుని నానా హంగామా చేశాడు. అయితే అదే సమయంలో అక్కడికి చేరుకున్న అతని భార్య రాధికా అఖిల్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. తను భర్త సైకోలా ఎలా ప్రవర్తిస్తాడో పూసగుచ్చినట్టు వివరించింది. తాను కూడా భర్త వేధింపులు తాళలేకే ఇటీవల ఇంట్లో నుంచి వచ్చేసి రాజంపేటలో ఉంటున్న తన తల్లి ఇంటికి వెళ్లినట్టు తెలిపింది. భర్త వేధింపులపై ఇటీవలే అన్నమయ్య జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసానని చెప్పింది.
అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదని ఆమె చెప్పుకొచ్చింది. తన భర్త వేధింపులు తాళలేక పోతున్నానని, తన విచక్షణరహితంగా దాడి చేస్తున్నాడని భర్త నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. దీనిపై పట్టణ సీఐ నాగార్జున స్పందిస్తూ పీఎస్‌లో విధులకు ఆటంకం కలిగించి, సిబ్బందిపై ఘర్షణకు దిగిన అఖిల్ కుటుంబంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అయితే తన భార్య ఫిర్యాదుతో అఖిల్‌పై కేసు నమోదు అయ్యిందని, ఇందులో అతని తల్లిదండ్రుల పేర్లు కూడా ఉన్నాయని.. వాటిని తొలగించాలని అఖిల్ కోరినట్టు పోలీసులు తెలిపారు. అందుకు నిరాకరించడంతోనే తమపై లంచం డిమాండ్ చేశామనే ఆరోపణలు మోపుతున్నట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
