AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలెంట్ ఉన్నవారికి అనిల్ సుంకర గోల్డెన్ ఛాన్స్.. అందరూ కొత్తవారితో ఎయిర్‌ఫోర్స్ షురూ..!

కొత్త టాలెంట్, కొత్త కొత్త కథలకు, క్రియేటివ్ ఆలోచనలకు ఎప్పుడూ ఇండస్ట్రీలో ఎప్పుడూ పెద్దపీట వేసే ఉంటుంది. దానిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకొచ్చారు. ఇప్పటికే 'షో టైమ్' రియాలిటీ షోతో కొత్త టాలెంట్‌ను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు అనిల్.

టాలెంట్ ఉన్నవారికి అనిల్ సుంకర గోల్డెన్ ఛాన్స్.. అందరూ కొత్తవారితో ఎయిర్‌ఫోర్స్ షురూ..!
Air Force Bezawada Batch
Rajeev Rayala
|

Updated on: Jan 27, 2026 | 1:38 PM

Share

కొత్తదనం నిండిన కథలకు, క్రియేటివ్ ఆలోచనలకు ఎప్పుడూ పెద్దపీట వేసే ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకొచ్చారు. ఇప్పటికే ‘షో టైమ్’ రియాలిటీ షోతో కొత్త టాలెంట్‌ను వెలికితీసే ప్రయత్నం చేస్తున్న ఆయన.. ఆ విజన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తూ ATV ఒరిజినల్స్‌ బ్యానర్‌పై ఓ క్రేజీ మూవీని అనౌన్స్ చేశారు. ఇండస్ట్రీలో రాణించాలనుకునే నూతన నటీనటులకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. పూర్తిగా కొత్తవారితో, ఫ్రెష్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ ఎయిర్‌ఫోర్స్‌–బెజవాడ బ్యాచ్ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

విజయవాడ నేటివిటీతో.. అక్కడి మట్టి వాసనలు అడుగడుగునా కనిపించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నలుగురు నిరుద్యోగ యువకుల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ.. వారి కష్టాలు, కన్నీళ్లు, వాటిని దాటుకుని వారు గమ్యాన్ని చేరే క్రమంలో సాగే సక్సెస్ జర్నీని చాలా సహజంగా చూపించబోతున్నారు. కేవలం వినోదం మాత్రమే కాకుండా, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఎలా గెలవాలనే స్పూర్తిని కూడా ఈ కథలో ప్రధానాంశంగా తీసుకున్నారు. యూత్ కనెక్ట్ అయ్యే అంశాలతో.. బెజవాడ బ్యాచ్‌ పడే పాట్లు, వాళ్ళ విజయాలను ఈ సినిమాలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమా అనౌన్స్‌మెంట్ స్టైల్ కూడా చాలా వినూత్నంగా.. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ప్లాన్ చేశారు. ఈ మూవీ ద్వారా పరిచయం అవుతున్న కొత్త నటుడు అర్జున్‌ ను వెల్కమ్ చేస్తూ విజయవాడ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికా వెళ్లి మాకు సలహాలు ఇచ్చే రేంజ్‌కి ఎదిగిన మా అర్జున్‌కు స్వాగతం అంటూ సరదా సెటైర్లతో ఉన్న ఈ బ్యానర్ సినిమాలోని వెటకారాన్ని, స్నేహాన్ని చెప్పకనే చెబుతోంది. కేవలం సినిమాగానే కాకుండా, ఎంతోమంది కలలను నిజం చేసే వేదికగా మారుతున్న ఈ ప్రాజెక్ట్ తాలూకు మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..