AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంకో హీరోయిన్ అయితే సగంలోనే చేతులెత్తేసేది.. ఆమె కాబట్టే చేసింది : గుణశేఖర్

సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న లేటేస్ట్ మూవీ ‘యుఫోరియా’. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు ఓ ప్ర‌త్యేక స్థానం ఉందన్న సంగతి తెలిసిందే.

ఇంకో హీరోయిన్ అయితే సగంలోనే చేతులెత్తేసేది.. ఆమె కాబట్టే చేసింది : గుణశేఖర్
Gunasekhar
Rajeev Rayala
|

Updated on: Jan 26, 2026 | 9:00 AM

Share

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్స్ లో గుణశేఖర్ ఒకరు. ఎన్నో  సూపర్ హిట్ సినిమాను అందించారు గుణశేఖర్. ఎన్నో సూపర్ హిట్స్ అందించిన గుణశేఖర్ ఇటీవల సినిమాల స్పీడ్ తగ్గించారు. చివరిగా ఆయన దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న లేటేస్ట్ మూవీ ‘యుఫోరియా’. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుణశేఖర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఓ హీరోయిన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో రుద్రమదేవి సినిమా ఒకటి. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా గురించి గుణశేఖర్ మాట్లాడుతూ..  ఒక్కడు చిత్రం తర్వాత వెంటనే రుద్రమదేవిని తెరకెక్కించాలని  ప్రయత్నాలు చేశా అని అన్నారు. మహిళా-ప్రధాన చిత్రం కావడంతో నిర్మాతలు పెట్టుబడి పెట్టడానికి వెనకాడారని ఆయన తెలిపారు. గుణశేఖర్ తనపై తనకు ఉన్న నమ్మకంతో సొంతంగా నిర్మాతగా మారి సినిమా చేశా అన్నారు. ఇక అనుష్క శెట్టి  గురించి మాట్లాడుతూ.. ఆమె గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలు వంటి కఠినమైన శిక్షణతో పాటు, ప్రమోషన్స్ లోనూ చురుగ్గా పాల్గొంది. రోజుకు పది, పదిహేను ఇంటర్వ్యూలు ఇస్తూ, ఏ ప్రమోషనల్ ఈవెంట్‌నూ కాదనకుండా పాల్గొంది. ఆమె ఎంత కష్టపడిందంటే.. కత్తి యుద్ధాల కారణంగా ఆమెకు భుజం ఎముక వద్ద సమస్య కూడా వచ్చిందని గుణశేఖర్ గుర్తు చేసుకున్నారు. వారియర్ క్వీన్ పాత్రను తెరపై అందంగా చూపించడం వెనుక అనుష్క అసాధారణ కృషి ఉందని, మరో నటి అయితే సగంలోనే చేతులెత్తేసేదని గుణశేఖర్ అన్నారు.

రుద్రమదేవి నిర్మాణ దశలో గుణశేఖర్ పట్ల పరిశ్రమలో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. గుణశేఖర్ పిచ్చివాడు, ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాడు వంటి కామెంట్స్ వినిపించినప్పటికీ, ఆయన చరిత్రపై, కథపై ఉన్న నమ్మకంతో ముందుకు సాగారు. నిర్మాతగా ఆయనకు టేబుల్ ప్రాఫిట్ మిగలకపోయినా, సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందని, అది తన శ్రమకు, కథకు, అనుష్క శెట్టి కృషికి లభించిన విజయమని చెప్పుకొచ్చారు గుణశేఖర్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

మీ బంగారం బ్యాంక్ లాకర్‌లో భద్రంగా ఉందా? RBI రూల్స్‌ తెలిస్తే..
మీ బంగారం బ్యాంక్ లాకర్‌లో భద్రంగా ఉందా? RBI రూల్స్‌ తెలిస్తే..
6 బంతులు, 22 పరుగులు.. ఒకే ఓవర్‌లో మ్యాచ్ తిప్పేసిన అభిషేక్ శర్మ
6 బంతులు, 22 పరుగులు.. ఒకే ఓవర్‌లో మ్యాచ్ తిప్పేసిన అభిషేక్ శర్మ
ఇంకో హీరోయిన్ అయితే సగంలోనే చేతులెత్తేసేది..
ఇంకో హీరోయిన్ అయితే సగంలోనే చేతులెత్తేసేది..
ఐఏఎఫ్‌ అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇంటర్‌ అర్హత
ఐఏఎఫ్‌ అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇంటర్‌ అర్హత
రాజనాల గురించి ఈ విషయాలు తెలిస్తే మీరు పక్కా ఆశ్చర్యపోవాల్సిందే..
రాజనాల గురించి ఈ విషయాలు తెలిస్తే మీరు పక్కా ఆశ్చర్యపోవాల్సిందే..
కిలో చికెన్‌ పచ్చడి అమ్మితే ఎంత లాభం వస్తుందే తెలుసా?
కిలో చికెన్‌ పచ్చడి అమ్మితే ఎంత లాభం వస్తుందే తెలుసా?
భీష్మ అష్టమి.. ఈరోజు ఉపవాసం ఉంటే తెలివైన సంతానం కలుగుతారు తెలుసా.
భీష్మ అష్టమి.. ఈరోజు ఉపవాసం ఉంటే తెలివైన సంతానం కలుగుతారు తెలుసా.
60బంతుల్లోనే కివీస్ కథ ఖతం..వరల్డ్ రికార్డులు బద్దలుకొట్టిన భారత్
60బంతుల్లోనే కివీస్ కథ ఖతం..వరల్డ్ రికార్డులు బద్దలుకొట్టిన భారత్
అందుకే షో నుంచి బయటకు వచ్చేశా..
అందుకే షో నుంచి బయటకు వచ్చేశా..
వెన్నుపూస విరిగినా వందల సినిమాల్లో నటించిన లెజెండ్
వెన్నుపూస విరిగినా వందల సినిమాల్లో నటించిన లెజెండ్