మందు తాగేటప్పుడు ఖచ్చితంగా ఈ పని చేయండి.. ఆరోగ్యం బాగుంటుంది : హర్షవర్ధన్
తెలుగులో ఎంతో మంది అద్భుతమైన నటులు ఉన్నారు వారిలో హర్ష వర్ధన్ ఒకరు. ఈయన కేవలం నటుడే కాదు.. రచయిత కూడా.. రీసెంట్ గా చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆయన తన నటనతో ఆకట్టుకున్నారు.

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశాంకురవరప్రసాద్ గారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు హర్షవర్ధన్, రచయితగా పలు సినిమాలకు పని చేసిన ఆయన నటుడిగాను రాణించారు. కాగా హర్షవర్ధన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వినోదం కోసం వెళ్లి 19 బీర్లు తాగి డీహైడ్రేషన్ కారణంగా ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మరణించిన విషాద సంఘటనను ఆయన ప్రస్తావించారు. హర్షవర్ధన్ తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ, దాదాపు 7-8 సంవత్సరాల పాటు మంచి నీళ్లు తక్కువ తాగడం వల్ల నరకం చూశానని అన్నారు.
జిమ్‌లో రోజుకు 90 నిమిషాల పాటు కార్డియో వ్యాయామాలు చేసేవారని, ఆ సమయంలో నాగబాబు ఆయనను చూసి అంత తీవ్రంగా చేయవద్దని, నీటిని సరిపడా తాగాలని సూచించినట్లు గుర్తు చేసుకున్నారు. మార్నింగ్ 4 లీటర్లు, వ్యాయామం కోసం అదనంగా 2 లీటర్లు మొత్తం 6 లీటర్ల నీరు తాగాల్సిన తాను కేవలం 2 లీటర్లతోనే సరిపెట్టేవాడిని అని అన్నారు. దాహం వేసినప్పుడు మాత్రమే తాగడం వల్ల ఒకరోజు తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చిందని, గుండెపోటు అనుకోని ఆసుపత్రికి వెళ్తే యాంజియోగ్రామ్ కూడా చేశారని తెలిపాడు.
దాంతో డీహైడ్రేషన్ ప్రమాదాలపై అవగాహన వచ్చిందని అన్నారు అలాగే హీరో నితిన్ తండ్రితో కలిసి తాగినప్పుడు, ప్రతి డ్రింక్ తర్వాత నీటిని తప్పకుండా తాగేవారని, లేకపోతే నితిన్ కూడా నీళ్లు తాగమని గుర్తు చేసేవారని తెలిపారు హర్ష. తాను కూడా అదే అలవాటు చేసుకున్నా అని.. ఇప్పుడు డ్రింక్ పార్టీలకు వెళ్లే ముందు కనీసం అర లీటరు నుంచి లీటరు నీళ్లు తాగి వెళ్లమని తన స్నేహితులకు సూచిస్తున్నానని చెప్పారు. పండుగల సమయంలో అధికంగా ఆల్కహాల్ సేవించడం, స్పైసీ ఫుడ్ తినడం, ఎక్కువ తిరగడం వంటివి శరీరం డీహైడ్రేషన్‌కు గురి కావడానికి కారణమవుతాయని అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




