Megastar Chiranjeevi: ప్రాణాపాయంలో అభిమాని.. అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి..

Megastar Chiranjeevi: ఎవరు ఆపదలో ఉన్నారని తెలిసినా వెంటనే ఆదుకునే మెగాస్టార్ చిరంజీవి.. తన అభిమానికి ఆపద వస్తే ఊరుకుంటారా? ఛాన్సే లేదు.

Megastar Chiranjeevi: ప్రాణాపాయంలో అభిమాని.. అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి..
Chiranjeevi
Follow us

|

Updated on: Aug 16, 2022 | 7:59 PM

Megastar Chiranjeevi: ఎవరు ఆపదలో ఉన్నారని తెలిసినా వెంటనే ఆదుకునే మెగాస్టార్ చిరంజీవి.. తన అభిమానికి ఆపద వస్తే ఊరుకుంటారా? ఛాన్సే లేదు. తాజాగా ఇదే జరిగింది. తన అభిమాని అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న చిరంజీవి.. వెంటనే రంగంలోకి దిగడమే కాక ఆయనను హైదరాబాద్ పిలిపించి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్ తన హీరో బాటలోనే సమాజ సేవలో మునిగిపోయారు. చక్రధర్ పేదలకు చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించి.. ఎన్నో కుటుంబాలను, మెగాభిమానుల తరపున ఆదుకున్నాడు. అయితే, చక్రధర్ క్యాన్సర్ బారిన పడ్డాడు. గత కొన్నాళ్ల నుంచి క్యాన్సర్ చికిత్స పొందుతున్నాడు. అయితే, అనారోగ్యంతో ఉన్న చక్రధర్ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఇటీవల ఒమేగా హాస్పిటల్‌లో చేర్పించారు. అంతేకాదు ఆస్పత్రిలో చక్రధర్‌ను కలిసి పరామర్శించాడు. వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. ఆస్పత్రిలోని వైద్యులతో మాట్లాడి చక్రధర్ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. క్యాన్సర్ గురించి భయం అక్కర్లేదని, తాను అండగా ఉంటానని చక్రధర్ కు అభయమిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. చక్రధర్ కుటుంబ సభ్యులకు కూడా భరోసా ఇచ్చారు.

కాగా, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తనకు ట్రీట్‌మెంట్ ఇప్పించడంపై భావేద్వాగానికి గురయ్యాడు చక్రధర్. చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఉద్వేగభరితమైన పోస్ట్ ఒకటి పెట్టాడు. చిరంజీవి తనను చూడటానికి రావడం తన అదృష్టంగా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్‌టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..