Venu Thottempudi: టాలీవుడ్ నటుడు వేణు ఇంట తీవ్ర విషాదం..
జనవరి 29న తెల్లవారుజామున వేణు తండ్రి కన్నుమూశారు. దాంతో వేణు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు కన్నుమూయడంతో పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ టాలీవుడ్ నటుడు వేణు ఇంతా విషాదం నెలకొంది. వేణు తండ్రి కన్నుమూశారు. నటుడు వేణు తండ్రి ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు (92) వృద్దాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు. జనవరి 29న తెల్లవారుజామున వేణు తండ్రి కన్నుమూశారు. దాంతో వేణు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు కన్నుమూయడంతో పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నేటి మధ్యాహ్నం ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.
వేణు హీరోగా కెరీర్ ప్రారంభించి మంచి విజయాలను అందుకున్నారు. చాలా సినిమాల్లో హీరోగా నటించిన వేణు ఊహించని విధంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఆతర్వాత దమ్ము , రవితేజ రావణాసుర సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాడు వేణు. ఇటీవలే అతిథి అనే వెబ్ సిరీస్ లో నటించారు వేణు . ఈ వెబ్ సిరీస్ డిస్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 12.30 వేణు తండ్రి వెంకట సుబ్బారావు అంతక్రియలు నిర్వహించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
