AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey Rose: ఇన్నాళ్లకు మళ్లీ తెలుగులో.. ఆ స్టార్ హీరో సినిమాలో హనీరోజ్..?

వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. వీరి సింహ రెడ్డి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది హనీరోజ్. ఆ తర్వాత ఈ అమ్మడు మరో తెలుగు సినిమాలో నటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. నిత్యం షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తో బిజీ బిజీగా గడిపేస్తోంది హనీరోజ్.

Honey Rose: ఇన్నాళ్లకు మళ్లీ తెలుగులో.. ఆ స్టార్ హీరో సినిమాలో హనీరోజ్..?
Honey Rose
Rajeev Rayala
|

Updated on: Jan 29, 2024 | 10:21 AM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది డ్యూయల్ రోల్ లో బాలయ్య నటించి మెప్పించాడు. అలాగే ఈ సినిమాలో మలయాళ బ్యూటీ హానీ రోజ్ నటించింది. వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. వీరి సింహ రెడ్డి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది హనీరోజ్. ఆ తర్వాత ఈ అమ్మడు మరో తెలుగు సినిమాలో నటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. నిత్యం షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తో బిజీ బిజీగా గడిపేస్తోంది హనీరోజ్.

హనీరోజ్ చేసిన సినిమాలు తక్కువే కానీ ఈ చిన్నదానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హానిరోజ్ కు ఇన్ స్టా గ్రామ్ లో 4 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా హనీ రోజ్ ఓ టాలీవుడ్ సినిమాలో నటించనుందని టాక్ వినిపిస్తుంది. హనీ రోజ్ మరోసారి సీనియర్ హీరోతో జతకట్టనుంది తెలుస్తోంది. గతంలో బాలయ్యతో జతకట్టిన హనీ రోజ్ ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో నటించనుందని టాక్ వినిపిస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న నయా మూవీ విశ్వంభర. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. వశిష్ఠ చిరంజీవి సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివే విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే హనీ రోజ్ ఈ సినిమాలో నటిస్తుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ సినిమాలో హనీ రోజ్ నటిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

హనీ రోజ్ ఇన్ స్టా గ్రామ్

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

హనీ రోజ్ ఇన్ స్టా గ్రామ్

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.