Bigg Boss 17: బిగ్ బాస్ 17 విజేతగా స్టాండప్ కమెడియన్ మునవ్వర్ ఫరూఖీ.. గెలుచుకుంది ఎంతంటే..
నిన్నటితో బిగ్ బాస్ సీజన్ 17 కూడా ముగిసింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 17 లో విజేతగా మునవ్వర్ ఫరూఖీ నిలిచాడు. విశేషం ఏంటంటే అతని పుట్టిన రోజున బిగ్ బాస్ టైటిల్ ను గెలుచుకున్నాడు ఈ స్టాండప్ కమెడియన్. టైటిల్ తో పాటు అతడికి భారీ బహుమతి కూడా లభించింది. బిగ్ బాస్ సీజన్ 17లో అంకితా లోఖండే, మన్నారా చోప్రా, మునవ్వర్ ఫరూఖీ, అభిషేక్ కుమార్, అరుణ్ మాశెట్టి ఫైనల్‌గా నిలిచారు.

స్టాండప్ కమెడియన్ మునవ్వర్ ఫరూఖీ ‘బిగ్ బాస్ 17’ టైటిల్ విజేతగా నిలిచాడు. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 పూర్తయ్యి చాలా రోజులు అయ్యింది. ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ సీజన్ 17 జరుగుతోంది. నిన్నటితో బిగ్ బాస్ సీజన్ 17 కూడా ముగిసింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 17 లో విజేతగా మునవ్వర్ ఫరూఖీ నిలిచాడు. విశేషం ఏంటంటే అతని పుట్టిన రోజున బిగ్ బాస్ టైటిల్ ను గెలుచుకున్నాడు ఈ స్టాండప్ కమెడియన్. టైటిల్ తో పాటు అతడికి భారీ బహుమతి కూడా లభించింది. బిగ్ బాస్ సీజన్ 17లో అంకితా లోఖండే, మన్నారా చోప్రా, మునవ్వర్ ఫరూఖీ, అభిషేక్ కుమార్, అరుణ్ మాశెట్టి ఫైనల్‌గా నిలిచారు. ముందుగా బిగ్ బాస్ హౌస్‌లో అరుణ్ మాశెట్టి ఎలిమినేట్ అయ్యాడు. అతని తర్వాత అంకితా లోఖండే, మన్నారా చోప్రా కూడా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. చివరగా మునవ్వర్ , అభిషేక్ మధ్య పోటీ జరిగింది. చివరకు మునవ్వర్ ను విన్నర్ గా అనౌన్స్ చేశారు. అతను ‘బిగ్ బాస్ 17’ ట్రోఫీ, రూ. 50 లక్షలు, హ్యుందాయ్ క్రెటా కారును బహుమతిగా అందుకున్నాడు.
మునవ్వర్ మొదటినుంచి బిగ్ బాస్ షోలో పాపులర్ కంటెస్టెంట్. కమెడియన్, సింగర్ అయిన మునవ్వర్ బిగ్ బాస్ హౌస్‌లో తన ఆటతో ప్రేక్షకులను మెప్పించాడు. బిగ్ బాస్ హౌస్‌లో మన్నారా, మునవ్వర్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పించింది. బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. టాస్క్ సమయంలో మునవ్వర్ తరచుగా మన్నార్ వైపు ఉండేవాడు. బిగ్ బాస్ మొదటి వారంలోనే అంకితా లోఖండే, మునవ్వర్ మంచి స్నేహితులయ్యారు. ఆటలో ఒకరికొకరు మద్దతుగా నిలిచారు. కానీ మునవ్వర్, మన్నారా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యంతో అంకిత దూరంగా ఉంది.
బిగ్ బాస్ హౌస్‌లోకి అయేషా ఖాన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో గేమ్ మారిపోయింది. బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన వెంటనే మునవ్వర్‌పై ఆరోపణలు చేసింది. మునవ్వర్ ఒకేసారి ఇద్దరితో డేటింగ్ చేస్తాడని ఆమె ఆరోపించింది. మునవ్వర్ చాలా మంది అమ్మాయిలను మోసం చేశాడని ఆమె తీవ్ర ఆరోపణ చేసింది.
మునవ్వర్ 1992 జనవరి 28న గుజరాత్‌లోని జునాగఢ్‌లో జన్మించారు. అతను స్టాండప్ కమెడియన్ , రాపర్ కూడా. గుజరాతీ ముస్లిం కుటుంబం నుండి వచ్చిన మునవ్వర్ చిన్నప్పటి నుండి అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాడు. అతను ఐదు సంవత్సరాల వయస్సు నుండి పని చేయాల్సి వచ్చింది. మునవ్వర్ చిన్న వయసులోనే ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నాడు. తల్లి మరణం తర్వాత ముంబైకి వచ్చాడు. మునవ్వర్ తండ్రి కూడా 2020లో చనిపోయాడు. అదే సంవత్సరంలో, అతను తన యూట్యూబ్ ఛానెల్‌లో స్టాండప్ కామెడీ వీడియోను పోస్ట్ చేశాడు. అతను ‘దౌద్, యమ్‌రాజ్, ఔరత్’ వీడియోతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




