Pongal: ఇక నుంచి పండగలకు తెలుగు సినిమాలు మాత్రమే రిలీజ్.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రీజన్ ఏమిటంటే..

స్ట్రయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటూ.. తాజాగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అలాగని ఇదేం ఇప్పటి నిర్ణయం కాదు. 2017 డిసెంబర్ 8న జరిగిన ఒక అత్యవసర సమావేశంలో తీస్కున్న డెసిషన్. ఇక ఇదే విషయంపై 2019లోదిల్ రాజు ఒక మీడియా సమావేశంలో చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు.

Pongal: ఇక నుంచి పండగలకు తెలుగు సినిమాలు మాత్రమే రిలీజ్.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రీజన్ ఏమిటంటే..
Telugu Movies In Pongal Season
Follow us

|

Updated on: Nov 14, 2022 | 7:34 AM

సంక్రాంతి, దసరా బరిలోకి కేవలం తెలుగు చిత్రాలే. డబ్బింగ్ చిత్రాలకు థియేటర్లు ఇవ్వరాదు. ఇదీ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి.. అచ్చ తెలుగులో జారీ చేసిన స్వచ్ఛమైన ఉత్తర్వు. మరి నానాటికీ పాన్ ఇండియా స్థాయికి చేరుతున్న తెలుగు సినిమా చిత్తర్వుకు ఆ ఉత్తర్వు ఎలాంటి అడ్డంకులు సృష్టించనుంది? తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి .. పెరిగిన నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని.. నిర్మాతల శ్రేయస్సు కోరి.. తెలుగు సినిమాను కాపాడుకుందామనే లక్ష్యంతో .. సంక్రాంతి, దసరా వంటి పండగలకు సంచలన నిర్ణయం తీసుకుంది. స్ట్రయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటూ.. తాజాగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అలాగని ఇదేం ఇప్పటి నిర్ణయం కాదు. 2017 డిసెంబర్ 8న జరిగిన ఒక అత్యవసర సమావేశంలో తీస్కున్న డెసిషన్. ఇక ఇదే విషయంపై 2019లో దిల్ రాజు ఒక మీడియా సమావేశంలో చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. స్ట్రయిట్ సినిమాలుండగా.. డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఎలా ఇస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పటికే కాదు ఇప్పటికీ ఆచరణీయమేనంటోంది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడుకోవాలంటే.. స్ట్రయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే ఈ పండగల్లో థియేటర్లు కేటాయించాలని.. ఎగ్జిబిటర్స్ ని కోరుతున్నట్టు తమ లేఖలో వివరించారు.. నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శులు.

అయితే వచ్చే సంక్రాంతికి రెండు భారీ సినిమాలు తెలుగు సినిమా థియేటర్లపైకి దండెత్తనున్నాయి. మెగా- 154 వాల్తేరు వీరయ్య ఒకటి కాగా.. NBK- 107 వీరసింహారెడ్డి మరొకటి. వాల్తేరు వీరయ్యకు బాబీ దర్శకుడు కాగా.. వీరసింహారెడ్డిని గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లను బట్టీ చూస్తే సంక్రాంతి బరిలోకి కాలికి కత్తికట్టుకుని దిగే పందెంకోళ్లలా కనిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలకు దర్శకులు హీరోలు వేరైనా.. నిర్మాతలు మాత్రం మైత్రీ మూవీ మేకర్సే. హీరోయిన్ విషయానికి వస్తే కూడా ఒకరే. ఆమే శృతీ హాసన్.

ప్రొడ్యూసర్లు ఒకరే అయినా.. హీరోలు మాత్రం వేరు వేరు కావడం. ఈ ఇద్దరు హీరోలకు బాక్సాఫీస్ ముందు ప్రేక్షకాదరణ డైనమిగ్గా ఉండటం ఒకానొక ఆసక్తికరమైన అంశం. అందునా సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు హీరోలకు ఉన్న ట్రాక్ రికార్డే వేరు.. దీంతో ఈ రెండు సినిమాల రిలీజ్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇవి కూడా చదవండి

సరిగ్గా ఇదే సమయంలో ప్రస్తుతం తమిళ సినిమాను శాసిస్తోన్న ఇద్దరు అగ్రహీరోలు.. దళపతి విజయ్, తల అజిత్ సినిమాలు కూడా ఇదే సంక్రాంతికి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడానికి వస్తున్నాయి. ఇవి కూడా పొంగల్ స్పెషల్ గా తెలుగు సినిమా థియేటర్లలలోకి వచ్చి సందడి చేయడానికి రెడీ అంటే ఢీ అంటున్నాయి.

విజయ్ హీరోగా వస్తోన్న వారిసు తెలుగులో వారసుడుగా రిలీజవుతుండగా.. ఈ సినిమాకు దర్శకుడు మరెవరో కాదు వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్ రాజు. విజయ్ సౌతిండియన్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా 2023 జనవరి సంక్రాంతికే తన రిలీజ్ డేట్ ప్రకటించింది. ఒక రకంగా చూస్తే ఇది తెలుగు దర్శక నిర్మాతలు తీస్తున్న బై లింగ్వల్ మూవీ. ఇటు తమిళంతో పాటు అటు తెలుగులోనూ విడుదలవుతున్న చిత్రం. మరి ఈ సినిమా పరిస్థితేంటి? ఎంత కాదన్నా విజయ్ తమిళ హీరో. ఈ సినిమా తెరకెక్కుతోంది కూడా తమిళ మార్కెట్ ను మెయిన్ గా బేస్ చేసుకునే. ఒక వేళ తెలుగులో రిలీజైతే.. అది డబ్బింగ్ మూవీ కాకుండా పోదు. ఒకానొక సమయంలో దిల్ రాజు తాను అన్న మాటలను తానే వక్రీకరించడం కాదా? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది.

ఇక సంక్రాంతి, దసరా పండగలకు స్ట్రయిట్ తెలుగు సినిమాలు మాత్రమే విడుదల చేయాలన్న ఆలోచన చేస్తున్న నిర్మాతల మండలి ముందు నిలుస్తోన్న మరో సినీ సవాల్ ఏంటంటే.. తెలుగు సినిమా గతంలోలా లేదు. నానాటికీ పానిండియాకు విస్తరిస్తోంది. అల్లు అర్జున్ పుష్ప, విజయ్ దేవర కొండ లైగర్, నిఖిల్ కార్తికేయ టు.. ఇదే నిరూపించాయి. ఈ క్రమంలో.. ఇతర భాషా నిర్మాతలు కూడా ఇలాగే ఆలోచిస్తే పరిస్థితి ఏంటి? మన పానిండియా మార్కెట్ ను మనమే అడ్డుకోవడం కాదా? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పుడుతోంది.

దానికి తోడు.. ప్రభాస్ బాహుబలితో మొదలు పెట్టిన పానిండియా మానియా.. బాగా వర్కవుట్ అయ్యి.. ఇప్పుడాయన ఆదిపురుష్ లాంటి బయట ప్రొడక్షన్ కంపెనీలకు వర్క్ చేసే స్థాయికి చేరుకున్నారు. ఒక దశలో ఈ టాలీవుడ్- బాహుబలి బాలీవుడ్ ఎల్లలు దాటి హాలీవుడ్ దిశగానూ పరుగులు తీసేలా కనిపిస్తోంది. ఈ కండీషన్లో.. స్ట్రయిట్- నాన్ స్ట్రయిట్ తేడాలను చూడ్డం సాధ్యమేనా? అన్న ప్రశ్న భారీగా సౌండ్ చేస్తోంది.

విజయ్ దేవరకొండ సైతం లైగర్ తో తన మార్కెట్ పరిధి అమాంతం పెంచేసుకున్నారు. సినిమా ఫ్లాప్ అయినా.. బాలీవుడ్ లో విజయ్ ఫేస్ కట్ రికగ్నయిజ్ అయిపోయింది. కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ స్థాయికి చేరిపోయింది. తెలుగు సినిమా పరిధి నానాటికీ విస్తరించి.. బాలీవుడ్ హాలీవుడ్ స్థాయికి వెళ్తుంటే.. ఇంకా ఈ కట్టుబాట్లేంటన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇదే సంక్రాంతికి విడుదలవుతున్న వారసుడు.. తమిళ హీరో అయినా దర్శక నిర్మాతలు తెలుగు వారే. మరి ఈ సినిమాకు తెలుగు చిత్ర సీమకు సంబంధం లేదా? అన్న డౌట్ కూడా రైజ్ అవుతోంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో