AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుంచి గ్లామర్ బ్యూటీ ఎలిమినేట్ అయ్యింది..

గతవారం కూడా షాకింగ్ ఎలిమినేషన్స్ జరిగాయి. టాప్ 5లో ఉంటారని అనుకున్న వారంతా ఒకొక్కరుగా ఎలిమినేట్ అవుతూ బయటకు వచ్చేస్తున్నారు. గలాటా గీతూ కచ్చితంగా టాప్ 5లో ఉంటుందని అనుకుంటే ఆమె కూడా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుంచి గ్లామర్ బ్యూటీ ఎలిమినేట్ అయ్యింది..
Vasanthi
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2022 | 7:14 AM

Share

బిగ్ బాస్  సీజన్ 6 చివరిదశకు చేరుకుంటుంది. మరికొద్ది వారాల్లో సీజన్ 6 ముగియనుంది. ఈ క్రమంలోనే హౌస్ నుంచి ఒకొక్కరుగా ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పటికే హౌస్ నుంచి ఊహించని ఎలిమినేషన్స్ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నాయి. అలాగే గతవారం కూడా షాకింగ్ ఎలిమినేషన్స్ జరిగాయి. టాప్ 5లో ఉంటారని అనుకున్న వారంతా ఒకొక్కరుగా ఎలిమినేట్ అవుతూ బయటకు వచ్చేస్తున్నారు. గలాటా గీతూ కచ్చితంగా టాప్ 5లో ఉంటుందని అనుకుంటే ఆమె కూడా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇక బయటకు వచ్చిన గీతూ వెళ్లానంటూ పెద్ద రచ్చే చేసింది. ఇక గత వారం డబుల్ ఎలిమినేషన్స్ జరిగాయి. ఈ ఎలిమినేషన్స్ లో ముందుగా బాలాదిత్య శనివారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. హౌస్ లో రేలంగి మామయ్యా లా.. మంచితనానికి మారు పేరులా ఉన్న బాలాదిత్య హౌస్ నుంచి బయటకు రావడం నిజంగానే షాక్. అలాగే నిన్నటి ఎపిసోడ్ లో గ్లామర్ క్వీన్ వాసంతి కూడా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.

ఈ వారం మొత్తం 8 మంది హౌస్‌మెట్స్ నామినేషన్స్‌లో ఉండగా..ఒకొక్కరు సేఫ్ అవ్వగా చివరకు మెరీనా.. వాసంతి మిగిలారు. దాంతో ఇద్దరికి లాస్ట్‌లో హోస్ట్ నాగార్జున ఒక చిన్న పరీక్ష పెట్టారు. ఆ టెస్టు ఫలితంతో వాసంతి ఎలిమినేట్ అయ్యింది. నామినేషన్స్  లో ఉన్నవారికి ఒక సిలిండర్ లాంటి వస్తువు ఇచ్చి దానిలోపల ఉన్నదాన్ని బయటకు తీయాలన్నారు నాగ్. నిచ్చెన వస్తే సేఫ్.. పాము వస్తే అన్‌సేఫ్‌గా అని తెలిపారు. మెరీనా, ఆది రెడ్డి, శ్రీహాన్, రేవంత్, వాసంతి, ఇనయలకి పాము రావడంతో అన్‌సేఫ్‌గా మిగిలారు. అలానే కీర్తి, పైమా‌కి నిచ్చెన రావడంతో ఇద్దరు సేఫ్ అయ్యారు.

ఆ తర్వాత  రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఇనయలు సేఫ్ అయ్యారు. చివరికి మెరీనా, వాసంతి మిగిలారు.మెరీనా, వాసంతి ముందు ఫిష్ బౌల్స్ ఉంచిన నాగార్జున.. వారి చేతికి ప్లవర్ అందులో ముంచాలని చెప్పాడు. ఎవరి పువ్వు అయితే రెడ్ కలర్ లో మారుతుందో వాళ్ళు అవుట్ అని చెప్పారు. ఈ గేమ్ లో మెరీనా సేఫ్ అవ్వగా.. వాసంతి అన్ సేఫ్ అయ్యి ఎలిమినేట్ అయ్యింది. కన్నీళ్లతో వాసంతి హౌస్‌ని వీడింది.  స్టేజ్‌పై ఆమె జర్నీని చూస్తూ ఎమోషనల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి
Follow Us
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి