Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు మరణంపై సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం..
తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

తెలుగు సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం కోట శ్రీనివాస రావు వయసు 83 సంవత్సరాలు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే, విలన్ గా ముచ్చెమటలు పట్టించిన విలక్షణ నటుడిగా సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. మధ్యతరగతి తండ్రి, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, నవ్వించే పోలీసు, మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తికట్టించిన ఆయన.. ఇండస్ట్రీలో చెరగని స్థానం సంపాదించుకున్నారు.
కోట శ్రీనివాసరావు మరణంపై టాలీవుడ్ సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. “ఆయనను చూస్తూ.. ఆయనను మెచ్చుకుంటూ.. ప్రతి నటన నుంచి నేర్చుకుంటూ పెరిగాను. కోటా బాబాయ్ నాకు కుటుంబంలాంటివాడు. ఆయనతో కలిసి పనిచేసిన మధురమైన జ్ఞాపకాలను నేను గుర్తుంచుకుంటాను. కోట శ్రీనివాసరావు గారు, శాంతిగా విశ్రాంతి తీసుకోండి” అంటూ రవితేజ ట్వీట్ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు..
వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారి మరణం విచారకరం. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన… pic.twitter.com/4C6UL29KPR
— N Chandrababu Naidu (@ncbn) July 13, 2025
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
ప్రముఖ నటుడు…. కోట శ్రీనివాసరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
చలన చిత్ర పరిశ్రమకుఆయన లేని లోటు తీర్చలేనిది.
భౌతికంగా కోట గారు మన మధ్య లేకపోయినా… ఆయన పోషించిన విభిన్న పాత్రలతో… తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని… pic.twitter.com/ANsHre9lNx
— Revanth Reddy (@revanth_anumula) July 13, 2025
చిరంజీవీ..
లెజెండరీ యాక్టర్ , బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది.
'ప్రాణం ఖరీదు' చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన…
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 13, 2025
రవితేజ ట్వీట్..
Grew up watching him, admiring him, and learning from every performance.
Kota Babai was like family to me, I cherish the lovely memories of working with him.
Rest in peace, Kota Srinivasa Rao garu 🙏Om Shanti.
— Ravi Teja (@RaviTeja_offl) July 13, 2025
డైరెక్టర్ బాబీ..
“ఎన్నో ఎన్నెన్నో మధురానుభూతులు కోట శ్రీనివాసరావు గారు. మీ సినీచిత్ర జీవితంలో మీరు పోషించిన ప్రతీ పాత్ర ఒక అనుభూతి కలిగిస్తుంది. నవ్వించే వారు, ఏడిపించే వారు, చంపేద్దాం అనే కోపం తెప్పించేవారు. మిమ్మల్ని నేను ఎప్పడు మర్చిపోలేను. ” అంటూ ట్వీట్ చేశారు.
ఎన్నో ఎన్నెన్నో మధురానుభూతులు కోట శ్రీనివాసరావు గారు. మీ సినీచిత్ర జీవితంలో మీరు పోషించిన ప్రతీ పాత్ర ఒక అనుభూతి కలిగిస్తుంది. నవ్వించే వారు, ఏడిపించే వారు, చంపేద్దాం అనే కోపం తెప్పించేవారు. మిమ్మల్ని నేను ఎప్పడు మర్చిపోలేను. Miss you #KotaSrinivasaRao garu. 💔 pic.twitter.com/lFAYuSquwY
— BOBBY✌️ (@mekavannepuli) July 13, 2025
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..




