AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Horror: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.1600 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ…

ప్రపంచవ్యాప్తంగా సినీప్రియుల నుంచి మంచి ఆదరణ పొందిన హారర్ సినిమా గురించి తెలుసా.. ? రూ.2 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.1600 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా గురించి మీకు తెలుసా.. ? ఇప్పుడు ఆ చిత్రం గురించి తెలుసుకోవాల్సిందే.

OTT Horror: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.1600 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ...
Paranormal Activity
Rajitha Chanti
|

Updated on: Jul 13, 2025 | 8:54 AM

Share

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కేవలం రూ.2 కోట్లతో నిర్మించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కానీ విషయం ఏంటంటే.. ఈ సినిమాను కేవలం 7 రోజుల్లోనే షూటింగ్ చేసినట్లు సమాచారం. చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన హారర్ సినిమాగా ఇది అగ్రస్థానంలో నిలిచింది. పెద్ద స్టార్ హీరోలు లేరు.. గొప్ప సన్నివేశాలు లేవు.. ఈ చిత్రాన్ని హ్యాండ్ హెల్డ్ కెమెరాతో చిత్రీకరించడం మరో విశేషం. కానీ ఈ సినిమా లక్షలాది మందిని భయపెట్టింది. ఆ సినిమా పేరు ‘పారానార్మల్ యాక్టివిటీ’. 2007లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది.

కేటీ ఫెదర్‌స్టన్, మికా స్లాట్ నటించిన ఈ చిత్రాన్ని ఓరెన్ పీలే రచించి, దర్శకత్వం వహించి, నిర్మించారు. దర్శకుడు ఓరెన్ బెలికి ఇది మొదటి సినిమా. ఈ మూవీ మొత్తాన్ని ఆయన తన సొంత ఇంట్లోనే చిత్రీకరించారు. దర్శకత్వం నుంచి ఎడిటింగ్ వరకు ప్రతిదీ ఆయనే చూసుకున్నారు. ఈ సినిమాలో అందరూ చిన్న చిన్న నటీనటులు నటించారు. అలాగే ఈ మూవీ చూడటానికి చాలా వాస్తవికంగా ఉంటుంది.

ఈ సినిమా మొత్తానికి కేవలం రూ.12 లక్షల ఖర్చు అయినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ తిరిగి చిత్రీకరించడంతో బడ్జెట్ రూ.2 కోట్లకు చేరింది. ఒక యువ జంటను కనిపించని దెయ్యం ఎలా హింసిస్తుందనేది కథ. చీకటిలో అడుగుల చప్పుడు, భయంకరమైన నిశ్శబ్దం… అన్నీ థ్రిల్లింగ్ హర్రర్ అనుభవాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్ ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?

Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్‏లోకి సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ.. నెట్టింట ఫుల్ లిస్ట్ లీక్.. ఇక రచ్చే..

Cinema: ప్రపంచ రికార్డ్స్ బద్దలుకొట్టిన సినిమా అది.. 19 ఏళ్ల క్రితమే దుమ్మురేపింది.. ఇప్పటికీ ట్రెండింగ్‏లోనే..

Follow Us
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..