Tollywood: ‘నాపై చేతబడి చేశారు.. ఆరోజు గోవా బీచ్‌లో’.. భయానక అనుభవాన్ని పంచుకున్న టాలీవుడ్ హీరోయిన్
చాలా మంది హీరోయిన్లలాగే ఈ ముద్దుగుమ్మ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాతే సినిమాల్లోకి అడుగు పెట్టింది. తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అలాగే ప్రముఖ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ లోనూ సందడి చేసింది.

తెలంగాణలోని సికింద్రాబాద్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ లో ఓ వెలుగు వెలిగింది. 80 కుపైగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్లకు మోడల్ గా వ్యవహరించింది. అలాగే పలు అందాల పోటీల్లో పాల్గొంది. మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్ వంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగు పెట్టి సత్తా చాటింది. తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నూ నటించి మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తనకు ఎదురైన షాకింగ్ ఎక్స్‌పీరియెన్స్ ను షేర్ చేసుకుంది. ‘2017- 18 ఆ టైంలో నా సినిమా కెరీర్ బాగా డల్ అయిపోయింది. ఒకానొక దశలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఒకసారి నేను నా ఫ్రెండ్స్ తో గోవాకు వెళ్లిన టైంలో ఓ నెగిటివ్ ఎనర్జీ నన్ను కమ్మేసింది. గోవాలో ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీకి వెళ్లాను. అక్కడ బీచ్ వద్ద హ్యాపీగా అందరం హ్యాంగ్ అవుట్ అవుతున్నాం. అయితే బీచ్ వాటర్‌లో ఓ క్లాత్ నా కాలికి తగిలితే దాన్ని విదిలించేశాను. కానీ మళ్లీ అది కాలికి తగలడంతో క్లాత్ విప్పి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాను’
‘ఎవరో ఎవరికో చేతబడి చేశారు. ఆ క్లాత్‌లో 2 బొమ్మలు, మహిళ జుట్టు, ఆ బొమ్మలకు సూదులు గుచ్చేసి ఉన్నాయి. అలాంటివి ముట్టుకోకూకడదట. అది చూసి నాకు చాలా భయం వేసింది. అవి తీసి చూడడంతో నాలో మరింత భయం పెరిగిపోయింది. దీని గురించి ఇంట్లో వాళ్లకు ఏం చెప్పలేదు. కానీ ఉన్నట్లుండి జ్వరంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడ్డాను. ఆస్తమా లాంటి లక్షణాలు కూడా కనిపించాయి. సరిగా నిద్ర పట్టేది కాదు. మరింత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. భయంకరమైన ఆలోచనలు వచ్చేవి. బహుశా నా కెరీర్‌లో సక్సెస్ రాకపోవడానికి ఇదే కారణమేమో! ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడేందుకు నాకు సుమారు రెండేళ్లు పట్టింది. ఆ టైంలో నేను ఏ సినిమ కూడా చేయలేకపోయాను.’ అని తన భయానక అనుభవాలను షేర్ చేసింది నందినీ రాయ్.
నందినీ రాయ్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
‘040’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నందిని రాయ్. ఆ తర్వాత మాయ, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ తదితర సినిమాల్లో నటించింది. విజయ్ ‘వారసుడు’, శ్రీసింహా కోడూరి ‘భాగ్ సాలే’, ఆది సాయికుమార్ ‘సీఎస్ఐ సనాతన్’ తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించింది. మెట్రో కథలు, పంచతత్ర కథలు,గాలివాన తదితర హిట్ వెబ్ సిరీస్‌ల్లోనూ యాక్ట్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 2లోనూ సందడి చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








