Alia Bhatt: మళ్లీ తల్లి కానున్న అలియా భట్! బేబీ బంప్‌తో స్టార్ హీరోయిన్! నెట్టింట వైరల్ వీడియో
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తె వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారందరూ అలియా మళ్లీ గర్భం ధరించిందని అభిప్రాయ పడుతున్నారు. అయితే దీనిపై అటు అలియా కానీ, రణ్‌బీర్ కపూర్‌లు ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ 2022 నవంబర్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డకు ఇప్పుడు రెండున్నరేళ్లు. అయితే అలియా భట్ ఇప్పుడు మరోసారి తల్లి కానుందని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఒక వీడియోనే ఈ రూమర్లకు కారణం. అలియా భట్ తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తళుక్కుమంది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అలియా తొలిసారి రెడ్ కార్పెట్‌పై నడిచింది. ఈ సందర్భంగా ఆమె కెమెరాలకు పోజులు ఇచ్చింది. అయితే ఈ ఫొటోలు, వీడియోల్లో ఆమె కడుపు కొద్దిగా ముందుకు వచ్చినట్లు కనిపించింది. దీంతో అలియా భట్ మళ్లీ గర్భం ధరించిందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో పెళ్లైన ఏడు నెలలకే కూతురికి జన్మనిచ్చింది అలియా. దీంతో పెళ్లికి ముందే ఆమె గర్భం ధరించిందని అప్పట్లో రూమర్లు వచ్చాయి. అయితే ఆ బిడ్డ ఏడు నెలలకే పుట్టిందని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. దీని తర్వాత, అలియా భట్ పలు సినిమాల్లో నటించింది. ఇప్పుడు కూడా ఆమె చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి అలియా ప్రెగ్నెన్సీ వార్తలు గుప్పుమన్నాయి.
అలియా భట్ చివరిసారిగా 2024లో ‘జిగ్రా’ సినిమాలో కనిపించింది. పాన్ ఇండియా వైడ్ గా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం ఆమె ‘ఆల్ఫా’ అనే సినిమా 2025 లో నటిస్తోంది. ఇది యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగం. దీంతో పాటు ‘లవ్ అండ్ వార్’ సినిమాలో కూడా అలియా హీరోయిన్ గా నటిస్తోంది.
నెట్టింట వైరలవుతోన్న అలియా భట్ వీడియో..
“a night that honoured the power of women – in voice, in presence, in purpose 🤍” ——— Alia Bhatt via her Instagram pic.twitter.com/5Y5JMHIXoM
— Alia’s nation (@Aliasnation) May 24, 2025
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అలియా భట్..
View this post on Instagram
భర్త, కూతురితో అలియా భట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








