AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal: రీల్‌పై హీరో, హీరోయిన్లు మరి రియల్ లైఫ్‌లో.. హీరో విశాల్-శ్రియారెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

2006లో రిలీజైన పొగరు అనే సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు విశాల్- శ్రియా రెడ్డి. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే రీల్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ వీరిద్దరి మధ్య చాలా దగ్గరి బంధుత్వం ఉంది. అదేంటో తెలుసా?

Vishal: రీల్‌పై హీరో, హీరోయిన్లు మరి రియల్ లైఫ్‌లో.. హీరో విశాల్-శ్రియారెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?
Vishal, Sriya Reddy
Basha Shek
|

Updated on: May 24, 2025 | 7:28 PM

Share

ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది నటి శ్రియా రెడ్డి. పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నఆమె సలార్ సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో ఆమె లేడీ విలన్‌ రాధ రమా మన్నార్‌ పాత్రలో అద్భుతంగా నటించింది. తన స్క్రీన్ ప్రజెన్స్ కూడా సూపర్బ్ గా ఉంది. సలార్ లో ప్రభాస్, పృథ్విరాజు సుకుమారన్‌ల తర్వాత అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రోల్ శ్రియా రెడ్డిదే అని చెప్పుకోవచ్చు. కాగా శ్రియా రెడ్డి గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 2002లో రాజా హీరోగా అప్పుడప్పుడు అనే సినిమాలో ఈ బ్యూటీనే కథానాయికగా యాక్ట్ చేసింది. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన అమ్మ చెప్పింది సినిమాలో కూడా శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషించింది. తెలుగులో ఇదే ఆమెకు ఆఖరి సినిమా. అయితే తమిళ్ సినిమాల్లో మాత్రం కొనసాగింది. అలా విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇందులో విశాల్ ను ఎలాగైనా దక్కించుకోవాలనే ఈశ్వరి పాత్రలో శ్రియా రెడ్డి అదరగొట్టింది. దీని తర్వాత పలు సినిమాల్లోనూ ఆమె యాక్ట్ చేసింది. అయితే 2011 తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.

కాగా శ్రియా రెడ్డి 2008లో ప్రముఖ నిర్మాత విక్రమ్ కృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి తన భర్తతో కలిసి కొన్ని సినిమాలను నిర్మిస్తోందీ అందాల తార. ఈ దంపతులకు అమాలియా అనే కుమార్తె ఉంది. కాగా శ్రియా రెడ్డి భర్త విశాల్ కు సొంత అన్న అవుతాడు. అంటే విశాల్ కు శ్రియా రెడ్డి వదిన అవుతుంది.

ఇవి కూడా చదవండి

విశాల్- శ్రియా రెడ్డి నటించిన పొగరు సినిమాను ప్రొడ్యూస్ చేసింది విక్రమ్ కృష్ణనే. ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారట. ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. ఆ పై ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఓజీ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది శ్రియా రెడ్డి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ఆమె పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది.

అన్నా, వదినలతో హీరో విశాల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.