అయ్య బాబోయ్.. కేరింత భావన గుర్తుందా..ఇప్పుడు ఎలా ఉన్నదంటే?
కేరింత మూవీలో భావన పాత్రలో నటించిన సుకృతి తన అంద చందాలతో మాయ చేస్తుంది. బొద్దుగా తయారై తన గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. ఈ ఫొటోస్ చూసిన ఈ అమ్మడు అభిమానులు అయ్యబాయ్.. కేరింత బ్యూటీ ఏంటీ ఇలా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Updated on: May 25, 2025 | 1:36 PM

కేరింత మూవీ రిలీజై మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరూ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో నూకరాజు, భావన తమ అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకొని మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాలో అశ్వీన్, శ్రీ దివ్య హీరోహీరోయిన్లుగా నటిచిన విషయం తెలిసిందే.

నూకరాజు గర్ల్ ఫ్రెండ్ గా సుకృతి నటించింది. ఇక ముద్దుగుమ్మ సుకృతి అనడం కంటే భావనగానే అందరూ ఈ బ్యూటీని త్వరగా గుర్తుపడుతారు. అంతలా తన పాత్రలో లీనమైపోయి నటించింది ఈ బ్యూటీ.

ఇక కేరింత సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు చాలా అవకాశాలు వస్తాయని అనుకున్నారు అందరు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ బ్యూటీ తర్వాత సినిమాలకు దూరమైందనే చెప్పాలి.

తన తండ్రి చూసిన సంబంధం పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో ఆనందంగా ఎంజాయ్ చేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలతో మాయ చేస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ నీలి రంగు చీరలో అందంగా ముస్తాబై ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోల్లో ఈ అమ్మడును చూసిన తన ఫ్యాన్స్ ..అయ్య బాబోయ్ కేరింత నటి భావన ఏంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



