Manchu Manoj: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన హీరో మనోజ్.. ఆ విషయంపై గంటకు పైగా భేటీ..

టాలీవుడ్ సమస్యలపై మెగాస్టార్ నచిరంజీవి ఆధ్వర్యంలో పలువురు సినీపెద్దలు ఏపీ సీఎం జగన్‌ను కావనున్నారని ఈ ఆమధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Manchu Manoj: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన హీరో మనోజ్.. ఆ విషయంపై గంటకు పైగా భేటీ..
Manoj
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 06, 2021 | 1:46 PM

Manchu Manoj: టాలీవుడ్ సమస్యలపై మెగాస్టార్  చిరంజీవి ఆధ్వర్యంలో పలువురు సినీపెద్దలు ఏపీ సీఎం జగన్‌ను కలవనున్నారని ఈ ఆమధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే చిరంజీవి ఇంట్లో సమావేశమైన సినీపెద్దలు.. త్వరలో జగన్‌ను కలిసి సినిమా సమస్యలపై చర్చించాలనుకున్నారు. అయితే ఆతర్వాత ఇంతవరకు దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇదిలా ఉంటే తాజాగా యంగ్ హీరో మంచు మనోజ్ సీఎం జగన్‌ను కలవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మనోజ్ కలిశాడు. జగన్‌తో సానుకూలంగా చాలా ఎక్కువసేపు మనోజ్ భేటీ కొనసాగిందని తెలుస్తుంది. తాజాగా ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి జగన్‌తో కలిసి దిగిన ఫోటోని మనోజ్ పోస్ట్ చేశాడు మనోజ్. రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు శ్రమిస్తూ ఆశాజనకమైన ప్రణాళికలతో ముందుకెళుతున్నారని ప్రశంసలు కురిపించాడు మనోజ్.

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైయస్ జగన్ గారిని కలిసాను. రాష్ట్రం కోసం కొన్ని గొప్ప అభివృద్ధి ఆలోచనలను మార్పిడి చేసుకోవడం ఒక గౌరవం.. ఇది గొప్ప విశేషం. సమీప భవిష్యత్తు కోసం సీఎం గారి ప్రణాళికలను విన్నాను. ఇది చాలా ఆశాజనకంగా అనిపించాయి. జగన్ సార్ .. మీ విజన్ సాధించడానికి దేవుడు మీకు సమృద్ధిగా బలం మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. మీ పాలనకు శుభాకాంక్షలు“ అని మనోజ్ రాసుకొచ్చాడు. ఇక మనోజ్ సినిమాల విషయానికొస్తే ఎం.ఎం.ఆర్ట్స్ బ్యానర్‌ని స్థాపించి ఇందులో తొలిగా `అహం బ్రహ్మస్మి` అనే సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. రెండేళ్లుగా ఈ మూవీ షూటింగ్ పైనే మనోజ్ దృష్టి పెట్టాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jr. NTR: తారక్ అన్ని కార్లపై 9 నంబర్లే ఉండటానికి గల కారణం తెలుసా..

Bigg Boss 5 telugu: వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మ.. ఈ గేమ్ షోలో ఆకట్టుకోగలదా ?..

Ajith: సరిహద్దులు దాటిన ప్రేమ.. స్టార్ హీరో‏పై వీరాభిమానం.. బహుమతులను చూస్తే షాకవ్వాల్సిందే..