AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic: ఎనర్జిటిక్ స్టెప్స్‌తో దుమ్మురేపిన మెగాహీరో.. ఆకట్టుకుంటున్న ‘జోర్ సే’ సాంగ్

Republic: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ సినిమాలో తేజ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. దేవా కట్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Republic: ఎనర్జిటిక్ స్టెప్స్‌తో దుమ్మురేపిన మెగాహీరో.. ఆకట్టుకుంటున్న 'జోర్ సే' సాంగ్
Tej
Rajeev Rayala
|

Updated on: Sep 06, 2021 | 1:15 PM

Share

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ సినిమాలో తేజ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. దేవా కట్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. చాలా కాలం తర్వత ‘చిత్రలహరి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఆ సినిమా తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ‘చిత్రలహరి’ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్‌లో ప్రతిరోజు పండగే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత ‘సోలో బ్రతుకే సోబెటర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత దేవాకట్టా నుండి మూవీ రాబోతుండటంతో ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తోంది.ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రిపబ్లిక్ సినిమాలో సాయితేజ్ – రమ్యకృష్ణ మధ్య సన్నివేశాలు చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటాయని అంటున్నారు. అహంకారంతో కూడిన అధికారానికి .. బాధ్యతతో మెలిగే అధికారానికి మధ్య జరిగే పోరాటం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని ఫిలింనగర్‌లో టాక్.

తాజాగా ఈ సినిమానుంచి మంచి జాతర సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ‘జోర్ సే’ అంటూ సాగే ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి – సాకీ శ్రీనివాస్ – బరిమిశెట్టి కలసి ఆలపించారు. జోష్ ఫుల్ గా సాగిన ఈ పాటలో సాయి తేజ్ ఎనర్జిటిక్ స్టెప్స్ అలరిస్తున్నాయి. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jr. NTR: తారక్ అన్ని కార్లపై 9 నంబర్లే ఉండటానికి గల కారణం తెలుసా..

Bigg Boss 5 telugu: వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మ.. ఈ గేమ్ షోలో ఆకట్టుకోగలదా ?..

Ajith: సరిహద్దులు దాటిన ప్రేమ.. స్టార్ హీరో‏పై వీరాభిమానం.. బహుమతులను చూస్తే షాకవ్వాల్సిందే..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్