AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harsha Chemudu: కమెడియన్ హర్ష విడాకులు తీసుకుంటున్నాడా? ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా

చాలా సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పించిన హర్ష సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా కూడా మారాడు. మాస్ మహరాజా రవితేజ నిర్మించిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచినా నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు హర్ష. సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పోస్టులు పెడుతుంటాడు.

Harsha Chemudu: కమెడియన్ హర్ష విడాకులు తీసుకుంటున్నాడా? ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా
Harsha Chemudu
Basha Shek
|

Updated on: Aug 01, 2024 | 3:42 PM

Share

టాలీవుడ్ స్టార్ కమెడియన్‌ వైవా హర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక యూట్యూబర్ గా కెరీర్ ఆరంభించిన అతను తన సొంత ట్యాలెంట్ తో నటుడిగా మారాడు. పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా సపోర్టింగ్ రోల్స్ లో మెరిశాడు. చాలా సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పించిన హర్ష సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా కూడా మారాడు. మాస్ మహరాజా రవితేజ నిర్మించిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచినా నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు హర్ష. సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పోస్టులు పెడుతుంటాడు. అయితే ఈ మధ్యన హర్ష షేర్ చేసిన ఒక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ‘జీవితం అనేది రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లాంటిది. ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎగ్జయిట్‌మెంట్‌, చికాకు, భయం, థ్రిల్‌.. ఇలా అన్నీ లైఫ్ లో ఉంటాయి. కానీ, ఏవీ మన చేతిలో ఉండవు. కానీ మనల్ని ఆపడానికి వస్తాయి. తర్వాత అవే వెళ్లిపోతాయి. అప్పటివరకు మనం బకెల్‌ పట్టుకుని కూర్చుని రైడ్‌ను ఎంజాయ్‌ చేయాల్సిందే. తప్పం ఏం చేయాలేం. జీవితంలో దేనిని ఆశించకూడదు. తర్వాత నిరాశ చెందకూడదు. లైఫ్ ఎటు వెళ్తే అటు పోవడమే’ అంటూ ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా పోస్ట్ పెట్టాడు. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు హర్షకు ఏమైందని ఆలోచనలో పడ్డారు. కొందరైతే హర్ష తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు పుకార్లు సృష్టించాడు. తాజాగా ఈ రూమర్లపై స్పందించాడు హర్ష. ఈ మేరకు సోషల్ మీడియాలో మరో ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేశాడు.

‘మనం కింద పడినప్పుడు లేచి నిలబడటం నేర్చుకుంటాం. ఇంకా దృఢంగా ముందుకు సాగుతాం. నా గత పోస్టు గురించి ఆరా తీస్తున్న అందరికీ ధన్యవాదాలు. నా జీవితంలో యోగ క్షేమాల గురించి ఆరా తీసేవాళ్లు ఇంతమంది ఉన్నారా? అని సంతోషంగా అనిపించింది. విషయమేంటంటే.. నేను నా పర్సనల్ లైఫ్ లో చాలా సంతోషంగా ఉన్నాను.అయితే ఎటొచ్చి పని దగ్గరే కాస్త చికాకుగా ఉన్నాను. అక్కడ పనికిమాలిన పాలిటిక్స్ చేస్తున్నారు. దాని వల్లే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తాను. జీవితమంటే ఇంతే.. దానికి ఎవరూ ఎదురీదలేరు అని రాసుకొచ్చాడు ‘ అని మరో పోస్ట్ షేర్ చేశాడు హర్ష. తద్వారా విడాకుల రూమర్లను కొట్టి పారేశాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

ఇవి కూడా చదవండి

వైవా హర్ష గృహ ప్రవేశం ఫొటోస్

కాగా హర్ష తన ప్రియురాలు అక్షరను 2021లో పెళ్లాడాడు.

View this post on Instagram

A post shared by Harsha (@harshachemudu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..