AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manoj Bajpayee: అప్పుడు ఆఫర్ ఇస్తే నో చెప్పాడు.. ఇప్పుడు అదే దర్శకుడితో చేయాలని ఎదురుచూస్తున్నాడు

మనోజ్ బాజ్‌పేయి 100వ చిత్రం 'భయ్యా జీ' ఇటీవల విడుదలైంది. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు మనోజ్. మనోజ్ నటించిన కొన్ని సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయితే.. కొన్ని భారీ హిట్టయ్యాయి. అయితే మనోజ్ కొంతమంది ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేయాలని అనుకున్నాడు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో కలిసి పనిచేయాలనేది అతని కోరిక.

Manoj Bajpayee: అప్పుడు ఆఫర్ ఇస్తే నో చెప్పాడు.. ఇప్పుడు అదే దర్శకుడితో చేయాలని ఎదురుచూస్తున్నాడు
Manoj Bajpayee
Rajeev Rayala
|

Updated on: Aug 01, 2024 | 2:59 PM

Share

మనోజ్ బాజ్‌పేయి.. ఈయన తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు ఈ విలక్షణ నటుడు.  తన కెరీర్‌లో చాలా విభిన్నమైన పాత్రలను పోషించాడు మనోజ్. మనోజ్ బాజ్‌పేయి 100వ చిత్రం ‘భయ్యా జీ’ ఇటీవల విడుదలైంది. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు మనోజ్. మనోజ్ నటించిన కొన్ని సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయితే.. కొన్ని భారీ హిట్టయ్యాయి. అయితే మనోజ్ కొంతమంది ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేయాలని అనుకున్నాడు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో కలిసి పనిచేయాలనేది అతని కోరిక. అయితే, ఆ కోరిక ఇంతవరకూ నెరవేరలేదు.

ఇది కూడా చదవండి : నువ్వొస్తానంటే నేనొద్దంటానా‌లో నటించిన ఈ అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

మనోజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను గుల్జార్‌తో కలిసి పనిచేయలేకపోయాను. గోవింద్ నిహ్లానీతో కలిసి పని చేయాలనుకున్నాను. నేను సినిమా రంగంలోకి వచ్చేసరికి వాళ్లంతా కెరీర్‌ చివరి దశలో ఉన్నారు. కానీ శ్యామ్ బెంగాలీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది’ అని మనోజ్ అన్నారు.

ఇది కూడా చదవండి : Vikramarkudu: విక్రమార్కుడు విలన్ భావుజీ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.?

అలాగే సంజయ్ లీలా బన్సాలీతో కలిసి పనిచేయాలి. కానీ, ఆయన చేసే సినిమాల్లో నాలాంటి ఆర్టిస్టులు అవసరం లేదు. ఆయన నాలోని ఏ అందమైన కోణాన్ని చూపిస్తారు? అవి నిజంగా భిన్నమైనవి’ అని మనోజ్ అన్నారు. ఈ విషయాన్ని ఆయన సరదాగా చెప్పారు. మనోజ్‌కి ఏదో ఒక రోజు భన్సాలీతో కలిసి పనిచేసే అవకాశం ఇవ్వాలని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు..గతంలో మనోజ్ కు భన్సాలీ ‘దేవదాస్’ సినిమాలో నటించమని ఆఫర్ ఇచ్చాడు. చున్నిలాల్‌గా మనోజ్‌ నటించాల్సి ఉంది. ‘దేవదాస్’ సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలో చున్నీలాల్ కనిపిస్తాడు. ఈ పాత్రను మనోజ్ చేయాల్సింది. అయితే అప్పుడప్పుడే హీరోగా సినిమాలు చేస్తున్న మనోజ్.. ఫ్రెండ్ రోల్ చేస్తే తన కెరీర్ కు మైనస్ అవుతుందని భావించింది ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత జాకీ ష్రాఫ్ ఈ పాత్రలో నటించాడు. ఇక ఇప్పుడు సంజయ్ లీల బన్సాలీతో నటించాలని ఆశపడుతున్నారు మనోజ్. మరి మనోజ్ కు ఆ అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్