Shivam Bhaje Review: అశ్విన్ బాబు శివం భజే రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

హిడింబ లాంటి విభిన్నమైన సినిమా తర్వాత అశ్విన్ బాబు నటించిన సినిమా శివమ్ భజే. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ సినిమాకు అప్సర్ దర్శకుడు. శివుడి చుట్టూ తిరిగే కథతో వచ్చిన శివమ్ భజే ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Shivam Bhaje Review: అశ్విన్ బాబు శివం భజే రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
Shivam Bhaje
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 01, 2024 | 4:03 PM

మూవీ రివ్యూ: శివం భజే

నటీనటులు: అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, అర్భాజ్ ఖాన్, హైపర్ ఆది, సాయి ధీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి తదితరులు..

సంగీతం: వికాస్ బడిస

సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర

ఎడిట‌ర్ : ఛోటా కె. ప్రసాద్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: అప్సర్‌

నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలి

హిడింబ లాంటి విభిన్నమైన సినిమా తర్వాత అశ్విన్ బాబు నటించిన సినిమా శివమ్ భజే. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ సినిమాకు అప్సర్ దర్శకుడు. శివుడి చుట్టూ తిరిగే కథతో వచ్చిన శివమ్ భజే ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

చందు (అశ్విన్ బాబు) ఓ బ్యాంక్‌లో EMI రికవరీ ఎజెంట్‌గా పని చేస్తుంటాడు. లోన్ కట్టకుండా తప్పించుకుని తిరిగే వాళ్ల దగ్గరికి వెళ్లి డబ్బులు వసూలు చేస్తుంటాడు. అలా ఓసారి ఓ ఇంటికి వెళ్లినపుడు శైలజ కృష్ణమూర్తి(దిగంగనా సూర్యవంశీ)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. శైలు కూడా చందును ఇష్టపడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు.. అలా జీవితం హాయిగా సాగిపోతున్న సమయంలో.. అనుకోకుండా జరిగిన ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. కానీ ఆ వెంటనే ఇంకో కళ్లు అమర్చి ఆపరేషన్ చేస్తారు.. చూపు కూడా వస్తుంది. కానీ ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో చందూ జీవితం అనుకోని కుదుపులకు లోనవుతుంది. కొత్త కళ్ళు పెట్టిన తర్వాత సరిగ్గా నిద్ర పట్టకపోవడం.. ఏవేవో మర్డర్స్ చూసినట్లు కనిపించడం మొదలవుతుంది. ఇదంతా ఆ శివయ్య లీల అంటూ ఓ స్వామీజీ చందూకు చెప్తాడు. ఆ తర్వాత చందూ లైఫ్ ఎటు వైపు వెళ్లింది.. ఏమైంది అనేది అసలు కథ..

కథనం:

అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు అంటారు కదా.. మన దర్శకుల ఆలోచన తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుందిప్పుడు. ఈ మధ్య ఏ సినిమాలో చూసినా ఏదో ఓ దేవుడిని కథలోకి తీసుకొస్తున్నారు. అఖండలో శివయ్య.. హనుమాన్‌లో అంజనీ పుత్రుడు.. కల్కిలో కృష్ణుడు.. ఇప్పుడు శివం భజేలో ఆ శంకరుడు.. కథలో దేవున్ని కలిపేస్తున్నారు. దర్శకుడు అప్సర్ తీసుకున్న లైన్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆ లైన్ స్క్రీన్ మీదకు వచ్చేసరికి గాడి తప్పింది. అశ్విన్ లాస్ట్ సినిమా హిడింబ మాదిరే.. శివం భజే కూడా కేవలం ఐడియా వరకు అదిరిపోయింది. కథా పరంగా అదిరిపోయిన శివం భజే.. స్క్రీన్ ప్లే లోపాలతో యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. మొదటి 15 నిమిషాలు ఆసక్తికరంగా అనిపించింది. ఆ తర్వాత లవ్ ట్రాక్ పరమ రొటీన్.. హీరో యాక్సిడెంట్ సీన్ కూడా జస్ట్ ఓకే. యాక్సిడెంట్ తర్వాత వచ్చే ట్విస్ట్ సూపర్.. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. మనుషులు కాకుండా అక్కడ్నుంచి కుక్క చుట్టూ కథ తిరుగుతుంది. ఇంటర్వెల్ కార్డ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా పడింది. అక్కడ్నుంచి సెకండాఫ్ గానీ సరిగ్గా పడుంటే శివం భజే మంచి సినిమా అయ్యుండేది. మర్డర్ మిస్టరీలు.. ముందుగానే అర్థమైపోయే సన్నివేశాలు.. క్లైమాక్స్ వరకు ఎలాగోలా లాక్కొచ్చే సీన్స్‌తో నీరసంగానే సాగింది కథనం.. క్లైమాక్స్‌లో మాత్రం ఆ శివుడిని చూపించి కాస్త ఆకట్టుకున్నాడు దర్శకుడు అప్సర్. చాలా రొటీన్ కథను ఎన్నో మలుపులు తిప్పాడు దర్శకుడు అప్సర్. నిజానికి దీన్నింకా పకడ్బందీగా రాసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య ట్రాక్ చాలా నీరసంగా ఉంటుంది. ఏదో కావాలని పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఇక చైనా, పాకిస్తాన్ అంటూ అంతగా బిల్డప్ ఇచ్చినా.. కథలో దాని పాత్ర తక్కువగానే ఉంటుంది. మరోవైపు కెమికల్ ల్యాబులు, టెస్టులు అంటూ చూపిస్తారు కానీ దానిపై కూడా పెద్దగా క్లారిటీ లేదు. ఏం జరిగినా శివుడే చేయించాడు అని చూపించడం కూడా అంతగా ఆకట్టుకోలేదు. కాకపోతే దేవుడి కథలకు లాజిక్ అవసరం లేదు అనే లాజిక్‌తో ముందుకెళ్లిపోయాడు దర్శకుడు అప్సర్.

నటీనటులు:

అశ్విన్ బాబు తన వరకు మరోసారి బాగా చేసాడు. ఉన్నంతలో అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్‌లో మంచి ఎనర్జీ చూపించాడు. హీరోయిన్ దిగంగన సూర్యవంశీ పర్లేదు.. హైపర్ ఆది కామెడీ ఓకే అనిపించింది. అక్కడక్కడా మనోడి జబర్దస్త్ పంచులు పేలాయి. బ్రహ్మాజీ కూడా ఉన్నది రెండు మూడు సీన్స్ అయినా నవ్వించాడు. అర్బాజ్ ఖాన్ చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటించాడు. ఈయన పాత్ర ఊహించినట్లుగానే సాగుతుంది. చివర్లో చిన్న ట్విస్ట్ ఇచ్చాడంతే. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

ఇలాంటి దేవుడి నేపథ్యం ఉన్న సినిమాలకు ఆర్ఆర్ కీలకం. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిస ఓకే అనిపించాడు. ముఖ్యంగా శివుడి రీ రికార్డింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ దశరథీ శివేంద్ర వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సిన అవసరం ఉంది.. కానీ దర్శకుడి ఛాయిస్ కాబట్టి ఏమనలేం. అప్సర్ డైరెక్టర్‌గా కంటే రైటర్‌గా సక్సెస్ అయ్యాడేమో అనిపించింది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా శివం భజే.. ఇంట్రెస్టింగ్ ఐడియా.. స్లో నెరేషన్..

అశ్విన్ బాబు శివం భజే రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
అశ్విన్ బాబు శివం భజే రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
హార్ట్ బీట్‌తో ఐ ఫోన్ అన్‌లాక్.. తర్వలోనే మెంటలెక్కే ఫీచర్..!
హార్ట్ బీట్‌తో ఐ ఫోన్ అన్‌లాక్.. తర్వలోనే మెంటలెక్కే ఫీచర్..!
హైదరాబాద్ నుంచి 2 గంటల్లో బద్రీనాథ్.. వీకెండ్ లో ప్లాన్ చేయండి..
హైదరాబాద్ నుంచి 2 గంటల్లో బద్రీనాథ్.. వీకెండ్ లో ప్లాన్ చేయండి..
అప్పులు తీర్చకుండా.. పెట్టుబడి పెడితే లాభమా? నష్టమా?
అప్పులు తీర్చకుండా.. పెట్టుబడి పెడితే లాభమా? నష్టమా?
గూగుల్ ఫోటోస్ AI ఎడిటింగ్ ఫీచర్ ఉచితం..ఈ 4 మార్గాల్లో ఉపయోగించండి
గూగుల్ ఫోటోస్ AI ఎడిటింగ్ ఫీచర్ ఉచితం..ఈ 4 మార్గాల్లో ఉపయోగించండి
కమెడియన్ హర్ష విడాకులు తీసుకుంటున్నాడా? ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా
కమెడియన్ హర్ష విడాకులు తీసుకుంటున్నాడా? ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా
ఈఏపీసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
ఈఏపీసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
సూర్యోదయాన్ని చూడటం అంటే ఇష్టమా.. ఇవే బెస్ట్ ప్లేసెస్..
సూర్యోదయాన్ని చూడటం అంటే ఇష్టమా.. ఇవే బెస్ట్ ప్లేసెస్..
చాక్లెట్‌ వడాపావ్‌..ఇదేం ఐడియా తల్లీ! ఈ మహిళ చేసిన ప్రయోగం చూస్తే
చాక్లెట్‌ వడాపావ్‌..ఇదేం ఐడియా తల్లీ! ఈ మహిళ చేసిన ప్రయోగం చూస్తే
భారత్లో వియత్నాం ప్రధాని పర్యటన.. పీఎం మోదీపై ప్రశంసలు..
భారత్లో వియత్నాం ప్రధాని పర్యటన.. పీఎం మోదీపై ప్రశంసలు..